Conman Sukesh: ఆప్ నేతలు బెదిరిస్తున్నారు.. ఢిల్లీ నుంచి వేరే జైలుకు మార్చండి.. ఢిల్లీ ఎల్జీకి సుకేష్ చంద్రశేఖర్ లేఖ

ఆప్ నేతలపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో తనను, తన భార్యను ఢిల్లీ జైలులో అధికారులు వేధిస్తున్నారని సుకేష్ చంద్రశేఖరన్ ఢిల్లీ ఎల్జీకి లేఖ రాశాడు. తమను దేశంలోని వేరే ఏ జైలుకైనా తరలించాలని పేర్కొన్నాడు.

Conman Sukesh: ఆప్ నేతలు బెదిరిస్తున్నారు.. ఢిల్లీ నుంచి వేరే జైలుకు మార్చండి.. ఢిల్లీ ఎల్జీకి సుకేష్ చంద్రశేఖర్ లేఖ

Updated On : November 10, 2022 / 12:24 PM IST

Conman Sukesh: ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో జైలులో శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్ర శేఖరన్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాశాడు. తనను, తన భార్యను ఆప్ నేతలు బెదిరిస్తున్నారని, తనపై హింసకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

Sania Mirza: సానియా-షోయబ్ ఇప్పటికే విడిపోయారా? అసలు విషయం చెప్పిన స్నేహితులు

ఈ నేపథ్యంలో తమ రక్షణ దృష్ట్యా ఢిల్లీ జైలు నుంచి మరో ప్రాంతంలోని ఏ జైలుకైనా తమను బదిలీ చేయాలి అని లేఖలో కోరాడు. రాన్‌బాక్సీ సంస్థకు చెందిన మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి, వారి భార్యల వద్ద రూ.200 కోట్లు వసూలు చేశాడు సుఖేష్ చంద్రశేఖరన్. ఈ మోసానికి పాల్పడ్డందుకుగాను సుకేష్‌పై కేసు నమోదైంది. దీనితోపాటు అనేక కేసులు ఆయనపై నమోదయ్యాయి. దీంతో ఈడీ అధికారులు సుఖేష్‌ను అరెస్టు చేశారు. అలాగే ఈ కేసులో సంబంధం ఉందనే కారణంతో ఆయన భార్యను కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరు జైళ్లలో ఉన్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి ఆప్ నేతలపై సుకేష్ అనేక ఆరోపణలు చేశాడు. తన నేరాల్లో ఆప్ నేతల పాత్ర ఉందని వెల్లడించాడు.

India vs England: నేడు ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సెమీఫైనల్.. ఇండియా-పాక్ ఫైనల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

కేజ్రీవాల్ సహా పలువురు నేతలకు దీనితో సంబంధం ఉందని సుఖేష్ వెల్లడించాడు. ఆప్ నేతలపై ఫిర్యాదు చేశాడు. దీంతో జైల్లో తనను, భార్యను ఆప్ నేతలు బెదిరిస్తున్నారని, వారిపై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని హెచ్చరిస్తున్నారని సుకేస్ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనాకు రాసిన లేఖలో వివరించాడు. ఇప్పటికే తనను జైలులో సీఆర్పీఎఫ్ అధికారులు వేధిస్తున్నట్లు పేర్కొన్నారు. వారు తీవ్రంగా దాడి చేశారని, దీంతో తన మర్మాంగాలుసహా అనేక చోట్ల గాయాలయ్యాయని లేఖలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తనకు, తన భార్యకు ఢిల్లీ జైల్లలో రక్షణ లేదని, అందువల్ల దేశంలోని మరే జైలుకైనా బదిలీ చేయాలని లేఖలో కోరాడు.