Lalu Prasad Yadav: లాలూ కుమార్తె గొప్ప మనసు.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు అంగీకారం… సింగపూర్‌లో శస్త్రచికిత్స

అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్జేడీ అధినేత లాలా ప్రసాద్ యాదవ్‌కు ఆయన కుమార్తె కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చింది. లాలూ రెండో కుమార్తె రోహిణి కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైంది. లాలూ ప్రసాద్ యాదవ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

Lalu Prasad Yadav: లాలూ కుమార్తె గొప్ప మనసు.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు అంగీకారం… సింగపూర్‌లో శస్త్రచికిత్స

Updated On : November 10, 2022 / 11:36 AM IST

Lalu Prasad Yadav: ఆర్జేడీ అధినేత లాలా ప్రసాద్ యాదవ్‌ కుమార్తె పెద్ద మనసు చాటుకుంది. తన తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు సిద్ధపడింది. లాలా ప్రసాద్ యాదవ్ చాలా కాలం నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

Sania Mirza: సానియా-షోయబ్ ఇప్పటికే విడిపోయారా? అసలు విషయం చెప్పిన స్నేహితులు

కొంతకాలం క్రితం జైలు నుంచి విడుదలైన ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్‌లో ఉంటున్న లాలూ రెండో కుమార్తె రోహిణి.. తన తండ్రి అనారోగ్యం గురించి తీవ్రంగా కలత చెందారు. ఆయనకు కిడ్నీ మార్పిడి చేస్తే మెరుగైన జీవితం గడిపి, ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుసుకున్నారు. ఇటీవలే లాలూను తనతోపాటు సింగపూర్ తీసుకెళ్లిన ఆమె అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించింది. తన తండ్రికి కిడ్నీ ఇస్తే ఆయన కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో దీని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. తన తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు అంగీకరించింది. కిడ్నీ సంబంధిత సమస్యల్తో బాధపడుతున్న వారికి రక్త సంబంధీకులు ఎవరైనా కిడ్నీ దానం చేయొచ్చనే సంగతి తెలిసిందే.

India vs England: నేడు ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సెమీఫైనల్.. ఇండియా-పాక్ ఫైనల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

ఈ నేపథ్యంలో తండ్రిని కాపాడుకునేందుకు కిడ్నీ దానం చేయాలని రోహిణి నిర్ణయించుకుంది. అయితే, ఈ నిర్ణయాన్ని లాలూ వ్యతిరేకించారు. తన కూతురు కిడ్నీ తీసుకోవడానికి అంగీకరించలేదు. కానీ, వైద్యుల సూచన మేరకు అంగీకరించారు. రక్త సంబంధీకులు చేసే అవయవదానం మరింత సత్ఫలితాన్నిస్తుందని నమ్మడం వల్ల కూడా లాలూ దీనికి అంగీకరించారు. ఈ నేపథ్యంలో కిడ్నీ మార్పిడికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే లాలూ సింగపూర్ వెళ్లబోతున్నారు. అక్కడే ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరుగుతుంది. రోహిణి అక్కడే తన కిడ్నీ దానం చేస్తారు. ఈ నెల 20-24 మధ్యలో ఈ శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంది.