Elon Musk: ప్రపంచ ధనవంతుడు ఎలన్ మస్క్ వారానికి ఎన్ని గంటలు పని చేస్తున్నాడో తెలుసా?

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చేతిలో ప్రస్తుతం ఐదు కంపెనీలున్నాయి. దీంతో వాటి నిర్వహణా బాధ్యతలు చూసేందుకు ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తోంది. ఇప్పుడు తాను వారానికి 120 గంటలు పని చేస్తున్నట్లు ఎలన్ మస్క్ వెల్లడించాడు.

Elon Musk: ప్రపంచ ధనవంతుడు ఎలన్ మస్క్ వారానికి ఎన్ని గంటలు పని చేస్తున్నాడో తెలుసా?

Updated On : November 8, 2022 / 11:58 AM IST

Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచిన ఎలన్ మస్క్ తన స్థాయిని నిలబెట్టుకోవాలంటే నిరంతరం శ్రమించాల్సిందే. ఇంత సంపద ఉన్నప్పటికీ ఆయన జీవితం అంత తేలికైంది కాదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు చాలామందికంటే ఎక్కువగా శ్రమిస్తున్నాడు.

Samantha : లైఫ్‌లో ముందుకెళ్లలేనేమో అనిపించింది.. ఇంటర్వ్యూలో ఏడ్చేసిన సమంత..

ప్రస్తుతం తాను వారానికి 120 గంటలు పని చేస్తున్నట్లు మస్క్ వెల్లడించాడు. అంటే సగటున రోజుకు 17 గంటలకుపైనే పని చేస్తున్నాడు. ఈ విషయాన్ని మస్క్ ఇటీవల జరిగిన ఒక సదస్సు సందర్భంగా వెల్లడించాడు. ప్రస్తుతం మస్క్ చేతిలో ఐదు కంపెనీలు ఉన్నాయి. ఇటీవలే సొంతం చేసుకున్న ట్విట్టర్‌తోపాటు స్పేస్ ఎక్స్, టెస్లా, న్యూరాలింక్, మరో కాస్మెటిక్ కంపెనీ ‘ద బోరింగ్’ మస్క్ చేతిలో ఉన్నాయి. వీటి బాధ్యతలు చూడాలంటే ఆయన నిరంతరం పని చేయాలి. ఈ విషయంపై మస్క్ మాట్లాడారు. ‘‘ప్రస్తుతం వారానికి 120 గంటలు పని చేయాల్సి వస్తోంది. ఒకప్పుడు వారానికి 70-80 గంటలే పని చేసేవాడిని. కానీ, ఇప్పుడు బాధ్యతలు పెరిగాయి. నిద్ర లేవడం.. పని చేయడం, తిరిగి నిద్ర పోవడం, లేచి మళ్లీ పని చేయడం. వారమంతా ఇదే జరుగుతోంది’’ అని మస్క్ వెల్లడించాడు.

Samantha: యశోద సినిమా ఓకే చేసేందుకు సమంతకు ఎంత సమయం పట్టిందో తెలుసా?

మస్క్ ఇటీవలే ట్విట్టర్ సంస్థను 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కంపెనీని మరింత వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం తన దృష్టంతా ట్విట్టర్‌పైనే ఉందని, ఒకసారి తాను అనుకున్న లక్ష్యం సాధించాక స్పేస్ ఎక్స్, టెస్లాపై దృష్టి పెడతానని చెప్పాడు.