Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు… మరో ఇద్దరు వ్యాపారుల అరెస్టు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. అరబిందో సంస్థకు చెందిన పెన్నాక శరత్ చంద్రారెడ్డితోపాటు, మరో మద్యం వ్యాపారి వినోద్ బాబును ఈడీ అరెస్టు చేసింది. వీరిని ఈ రోజు ఢిల్లీ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు… మరో ఇద్దరు వ్యాపారుల అరెస్టు

Updated On : November 10, 2022 / 9:50 AM IST

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. వరుస దాడులు చేస్తూ, సంబంధిత వ్యక్తులను అరెస్టు చేస్తున్నారు. తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అరబిందో ఫార్మా సంస్థకు చెందిన పెన్నాక శరత్ చంద్రా రెడ్డితోపాటు మరో మద్యం వ్యాపారి వినోద్ బాబును అదుపులోకి తీసుకున్నారు.

Sania Mirza: సానియా-షోయబ్ ఇప్పటికే విడిపోయారా? అసలు విషయం చెప్పిన స్నేహితులు

తెలుగు రాష్ట్రాలకు చెందిన వీరిద్దరికీ మద్యం వ్యాపారంతో సంబంధాలు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మద్యం కంపెనీల ద్వారా వీరు కోట్లాది రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్నారు. అరబిందో ఫార్మా కంపెనీలో శరత్ చంద్రా రెడ్డి కీలక డైరెక్టర్‌గా ఉన్నాడు. ఈ గ్రూపులోని 12 కంపెనీలకు ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా కూడా కొనసాగుతున్నారు. ఈ సంస్థ పేరును కూడా సీబీఐ ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా శరత్ చంద్రా రెడ్డి ఈఎండీలు చెల్లించారు. ఈ కేసుకు సంబంధించి గత సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఈడీ శరత్ చంద్రా రెడ్డిని ప్రశ్నించింది.

India vs England: నేడు ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సెమీఫైనల్.. ఇండియా-పాక్ ఫైనల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

ఇప్పటికే అదుపులోకి తీసుకున్న శరత్ చంద్రా రెడ్డి, వినోద్ బాబును ఈడీ అధికారులు ఈ రోజు ఢిల్లీలోని ఈడీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్‌పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్‌ను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.