Greater Noida: బిర్యానీ రావడం లేటయిందని రెస్టారెంట్ సిబ్బందిపై దాడి… వీడియోలో రికార్డైన ఘటన

ఆర్డర్ చేసిన బిర్యానీ రావడం లేటయిందని రెస్టారెంట్ సిబ్బందిపై దాడి చేశారు కస్టమర్లు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Greater Noida: బిర్యానీ రావడం లేటయిందని రెస్టారెంట్ సిబ్బందిపై దాడి… వీడియోలో రికార్డైన ఘటన

Updated On : November 11, 2022 / 12:37 PM IST

Greater Noida: బిర్యానీ తీసుకురావడం ఆలస్యమైందని రెస్టారెంట్ సిబ్బందిపై దాడికి పాల్పడిందో గ్యాంగ్. ఈ ఘటన గ్రేటర్ నోయిడా పరిధిలో గత బుధవారం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాలోని అన్సల్ మాల్‌లో జోక్ పేరుతో ఒక రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు.

Pawan Kalyan: నేడు విశాఖలో ప్రధానితో పవన్ భేటీ.. ఏపీ రాజకీయాలపై చర్చ.. సాయంత్రం విశాఖకు పవన్

గత బుధవారం సాయంత్రం ఈ రెస్టారెంట్‌లోకి దాద్రి ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వారు బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే, బిర్యానీ రావడానికి కాస్త ఆలస్యమైంది. ఈలోపు కోపం తెచ్చుకున్న ఆ ముగ్గురిలోని ఒక వ్యక్తి వచ్చి రెస్టారెంట్ బిల్లింగ్ సెక్షన్‌లో పని చేస్తున్న వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. అతడిని కొట్టి, లాక్కెళ్లాడు. అనంతరం అతడిపై మరో ఇద్దరు కూడా దాడి చేశారు. దీనిపై బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో అక్కడి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.