Cyrus Mistry death: సైరస్ మిస్త్రీ మృతి కేసు.. కారు డ్రైవ్ చేసిన డా.అనహితపై కేసు నమోదు
ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ గత సెప్టెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. ప్రమాద సమయంలో కారు నడిపిన డా.అనహితపై కేసు నమోదు చేశారు.

Cyrus Mistry death: మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాలో, గత సెప్టెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న బ్యారియర్‌ను ఢీకొని, పక్కనే పొదల్లోకి దూసుకెళ్లింది.
Hyderabad: మేడ్చల్ జిల్లాలో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి… అందరూ అంబర్‌పేట వాసులే!
ఈ ఘటనలో సైరస్ మిస్త్రీ అక్కడికక్కడే మరణించారు. ఆయనతోపాటు మరో వ్యక్తి కూడా మరణించారు. కారులో ఉన్న డా.అనహిత, ఆమె భర్త డేరియస్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద సమయంలో డా.అనహిత పండోల్ అనే మహిళ కారు డ్రైవ్ చేసింది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. మెర్సిడెస్ సంస్థ కూడా తమ తరఫున విచారణ జరిపింది. దీనిలో భాగంగా పండోల్ భర్త డేరియస్ వాంగ్మూలాన్ని ఇటీవల పోలీసులు నమోదు చేసుకున్నారు. తర్వాత పోలీసులు జరిపిన విచారణ ద్వారా.. అలాగే మెర్సిడెస్ సంస్థ జరిపిన విశ్లేషణ ద్వారా ఈ ఘటనలో కారు డ్రైవ్ చేసిన డా.పండోల్ నిర్లక్ష్యం ఉందని తేలింది.
Arvind Kejriwal: గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఐదు సీట్లే.. రెండో స్థానం మాదే: అరవింద్ కేజ్రీవాల్
వీటన్నింటి ద్వారా పోలీసులు డా.పండోల్‌పై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైనందుకు ఆమెపై కేసు నమోదైంది. ఘటన తర్వాత పండోల్‌తోపాటు, ఆమె భర్త ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇటీవలే వీళ్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఒక లేన్ నుంచి మరో లేన్‌కు మారే క్రమంలో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు డేరియస్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.