Arvind Kejriwal: గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఐదు సీట్లే.. రెండో స్థానం మాదే: అరవింద్ కేజ్రీవాల్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదు కంటే తక్కువ సీట్లే వస్తాయని జోస్యం చెప్పారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్ ఎన్నికల అంశంపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

Arvind Kejriwal: గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఐదు సీట్లే.. రెండో స్థానం మాదే: అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal: త్వరలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు సీట్లకే పరిమితమవుతుందన్నారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. రాష్ట్రంలో తమ పార్టీ రెండో స్థానం సాధిస్తుందని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

Hyderabad: మేడ్చల్ జిల్లాలో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి… అందరూ అంబర్‌పేట వాసులే!

ఈ సందర్భంగా అక్కడి ఎన్నికలపై పలు విషయాలు తెలిపారు. ‘‘గుజరాత్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఒకవేళ మార్పు కోరుకోకపోతే మాకు అవకాశం లేదు. మాకు అక్కడ కనీసం 30 శాతం ఓట్లు రాబోతున్నాయి. మేం పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. కానీ, గుజరాత్ పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవి. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీని ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆ పార్టీకి ఐదుకంటే తక్కువ సీట్లే వస్తాయి. మేమే అక్కడ రెండో స్థానంలో ఉంటాం’’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.

Elon Musk: ఇండియన్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ షాక్.. భారీ సంఖ్యలో భారతీయుల తొలగింపు

డిసెంబర్ 8న ఫలితాలు ప్రకటిస్తారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు విడుదలవుతాయి. కాగా, గుజరాత్‌లో బీజేపీనే తిరిగి అధికారంలోకి వస్తుందని అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్.. తమ ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంతో సరిపెట్టుకుంటుందని చెప్పారు.