Engineering Colleges: ఇంజనీరింగ్ కాలేజీలపై ఏఎఫ్ఆర్‌సీ కొరడా.. అక్రమంగా సీట్లు కేటాయించినందుకు జరిమానా

సీట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడటంతోపాటు, అధిక ఫీజులు వసూలు చేస్తున్న తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీలపై ఏఎఫ్ఆర్‌సీ కొరడా ఝుళిపించింది. అక్రమంగా కేటాయించిన ఒక్కో సీటుకు రూ.10 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించింది.

Engineering Colleges: ఇంజనీరింగ్ కాలేజీలపై ఏఎఫ్ఆర్‌సీ కొరడా.. అక్రమంగా సీట్లు కేటాయించినందుకు జరిమానా

Updated On : November 5, 2022 / 8:20 PM IST

Engineering Colleges: తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల వైఖరిపై ఏఎఫ్ఆర్‌సీ (అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అధిక ఫీజుల వసూలుతోపాటు, బీ కేటగిరీ సీట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడిన ఇంజనీరింగ్ కాలేజీలపై చర్యలకు సిద్ధమైంది. అక్రమంగా కేటాయించిన ఒక్కో సీటుకు రూ.10 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించింది.

Elon Musk: ఇండియన్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ షాక్.. భారీ సంఖ్యలో భారతీయుల తొలగింపు

ఏఎఫ్ఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ పి.స్వరూప్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నియమనిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేయడంతోపాటు, అక్రమంగా సీట్లు కేటాయించిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అధిక ఫీజు వసూలు చేసిన కాలేజీల్లో ఒక్కో సీటుకు రూ.2 లక్షలు, అక్రమంగా కేటాయించిన ఒక్కో సీటుకు రూ.10 లక్షల జరిమానా విధించాలని తీర్మానించింది. అలాగే విద్యార్థుల దగ్గరి నుంచి అక్రమంగా, అధికంగా వసూలు చేసిన ఫీజును తిరిగి ఇప్పించాలని ఆదేశించింది. బీ కేటగిరి సీట్లకు తమ దరఖాస్తులు పరిశీలించడం లేదన్న ఫిర్యాదులను కాలేజీలకు పంపిన కమిటీ, ఇప్పటివరకు కేటాయించిన బీ కేటగిరి సీట్లను పరిశీలించాలని నిర్ణయించింది.

Arvind Kejriwal: గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఐదు సీట్లే.. రెండో స్థానం మాదే: అరవింద్ కేజ్రీవాల్

ప్రతిభ ఉండి సీట్లు దక్కని విద్యార్థులకు సీట్లు కేటాయించాలని కాలేజీలకు సూచించింది. ఇంజనీరింగ్ ఫీజులకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మొత్తం తెలంగాణలోని 159 కాలేజీల్లో వేర్వేరు ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. రూ.45 వేల నుంచి మొదలుకొని, రూ.లక్షకు పైగా ఫీజు నిర్ణయించింది. ఈ నిర్ణయం మూడేళ్లపాటు అమలులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.