Karnataka Girl: కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తుండగా క్రేన్ ఢీకొని యువతి మృతి.. వీడియోలో రికార్డైన ఘటన

కాలేజీ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న యువతిని క్రేన్ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక, బెంగళూరులో శుక్రవారం జరిగింది.

Karnataka Girl: కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తుండగా క్రేన్ ఢీకొని యువతి మృతి.. వీడియోలో రికార్డైన ఘటన

Updated On : November 5, 2022 / 4:43 PM IST

Karnataka Girl: కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఒక యువతిని క్రేన్ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ యువతి ఆస్పత్రిలో మరణించింది. ఈ ఘటన బెంగళూరు, వైట్‌ఫీల్డ్ ఏరియాలో శుక్రవారం జరిగింది.

Elon Musk: ఇండియన్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ షాక్.. భారీ సంఖ్యలో భారతీయుల తొలగింపు

నూర్ పిజా అనే యువతి శుక్రవారం రోడ్డుపై నడుచుకుంటూ కాలేజీ నుంచి ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక క్రేన్ ఆ యువతిని ఢీకొంది. క్రేన్ టైర్లు ఆమె పై నుంచి వెళ్లాయి. ఈ ఘటనలో నూర్ పిజా తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్ర గాయాలు కావడం వల్ల చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి కారణమని వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన బాధిత యువతి కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.

Hyderabad: మేడ్చల్ జిల్లాలో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి… అందరూ అంబర్‌పేట వాసులే!

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే ఈ ప్రాంతంలో కాలేజీలు ఉన్నప్పటికీ, కనీసం స్పీడ్ బ్రేకర్లు కూడా లేవని స్థానికులు ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి, నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.