India vs South Africa: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా.. అక్సర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాకు చోటు

ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆదివారం ప్రారంభమైంది. టీమిండియా టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు ఒక మార్పు చేసింది. అక్సర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాకు చోటు కల్పించింది.

India vs South Africa: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా.. అక్సర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాకు చోటు

India vs South Africa: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం ఇండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సాయంత్రం నాలుగున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

Kangana Ranaut: కంగనా బీజేపీలోకి రావొచ్చు.. కానీ షరతులివే: జేపీ నద్దా

ఇప్పటికే టోర్నీలో వరుసగా రెండు విజయాలతో రోహిత్ సేన జోరు మీదుంది. వరుసగా పాకిస్తాన్, నెదర్లాండ్ జట్లపై విజయాలు నమోదు చేసింది. కాగా, దక్షిణాఫ్రికా రెండు మ్యాచులు ఆడి ఒకటి గెలిచింది. మరో మ్యాచ్ రద్దైంది. అయితే, దక్షిణాఫ్రికా బలమైన జట్టు. ఈ టీమ్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఈ మ్యాచులో ఇండియా విజయం సాధిస్తే మన సెమీస్ బెర్త్ దాదాపు ఖాయమైనట్లే. ఇండియా ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో ఒక మార్పు చేసింది. అక్సర్ పటేల్ స్థానలో దీపక్ హుడాకు చోటు కల్పించింది. రెండు జట్ల వివరాలివి.

Maharashtra: లిజ్ ట్రస్‌ను ఆదర్శంగా తీసుకుని ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలి.. ‘మహా’ ప్రతిపక్ష నేతల డిమాండ్

భారత జట్టు: రోహిత్ శర్మ్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ షమి. దక్షిణాప్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రిలీ రోసోవ్, ఐదెన్ మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వ్యాన్ పార్నెల్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, లుంగి ఎగిడి, అన్రిచ్ నోకియా.