ఇంత క్లియర్‌గా చంద్రుడ్ని ఎప్పుడైనా చూశారా?

ఇంత క్లియర్‌గా చంద్రుడ్ని ఎప్పుడైనా చూశారా?

ఆస్ట్రోఫొటోగ్రాఫర్ ఆండ్రూ మెక్ కర్తీ మరోసారి చంద్రుడి హై డెఫినిషిన్(హెచ్‌డీ) ఇమేజ్ తో ముందుకొచ్చారు. 85 మెగా పిక్సెల్ తో కనిపిస్తున్న ఈ ఫొటోలో ప్రతీది సుస్పష్టంగా కనిపిస్తుంది. చంద్రుని తలంపై జియోగ్రాఫికల్ మార్కింగ్స్ కూడా కనిపించేంతలా ఉంది.



ఆసక్తికరమైన అంశమేమిటంటే.. ఫైనల్ ఇమేజ్ పూర్తిగా కనిపించలేదు. అది కేవలం సింగిల్ ఇమేజ్ మాత్రమే కాదు. 24వేల ఫొటోగ్రాఫ్‌లు కలిసిన క్లిప్పింగ్ అది. ఇది తీయడం కోసం మెక్ కర్తీ 2000ఎమ్ఎమ్ తో 45నిమిషాల పాటు సెట్ చేసి ఫొటో తీశారు. చాలా తక్కువ డిస్టర్బెన్స్ ఉన్న ఫ్రేమ్స్ మాత్రమే బయటపెట్టారు.
https://10tv.in/japanese-company-successfully-tests-a-manned-flying-car/




‘హై ఫ్రేమ్ రేటింగ్ ఉన్న స్పెషల్ కెమెరా మాత్రమే వాడాను. నిమిషాల్లో లక్ష షాట్స్ తీయగలను’ అని మెక్ కర్తీ చెప్తున్నారు. ప్రోసెసింగ్ కే ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే దీనికి ఎక్కువ డేటా పడుతుంది. ఈ ఫ్రేములు అప్ లోడ్ చేయడానికి సాఫ్ట్ వేర్ వాడుతున్నా. కొన్ని ఫైల్స్‌ను ఫొటోషాప్ లో కలపడానికి ప్రయత్నించా. దీంతో పాటు పలు ప్రోగ్రాంల డేటాను. స్టాక్‌డ్ ఇమేజెస్ హై క్వాలిటీతో తీయడానికి ప్రయత్నించా’





‘ఎటువంటి నాయీస్, ఆర్టిఫ్యాక్ట్స్ లేకుండా స్పష్టమైన ఫొటోలు తీశాను. సాయంత్రం ఇమేజ్ తీయడం మొదలుపెడితే రెండో రోజు మధ్యాహ్నం 3గంటల వరకూ ఇమేజ్ తీయగలిగాను’ ఇంకా మరిన్ని వివరంగా తెలియాలంటే.. మెక్ కర్తీ స్పెషల్ వెబ్ సైట్ లో చూడాలని ఆయనే చెప్తున్నారు.