Adani: మళ్లీ పడిపోయిన అదానీ ర్యాంక్.. రెండు రోజుల్లో రెండు స్థానాలు డౌన్

నిన్నటి వరకు నాలుగో స్థానంలో ఉన్న లగ్జరీ గూడ్స్ తయారీ సంస్థ లూయిస్ వియుట్టన్ అధినేత బెర్నార్డ్ అర్నాల్డ్ ఏకంగా రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానాన్ని పదిలపర్చుకున్నారు. ఫోర్బ్స్ ప్రకటించిన తాజా జాబితాలో వీరి సందప వరుసగా లూయిస్ వియుట్టన్-141.2 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్-141.1 బిలియన్ డాలర్లు, అదానీ-134.2 బిలియన్ డాలర్లు గా ఉన్నాయి

Adani: మళ్లీ పడిపోయిన అదానీ ర్యాంక్.. రెండు రోజుల్లో రెండు స్థానాలు డౌన్

Adani: ప్రపంచ కుబేరుల జాబితాలో భారత అపర కుబేరుడు గౌతమ్ అదానీ ర్యాంక్ మరోసారి పడిపోయింది. రెండు రోజుల్లో ఆయన ర్యాంకు రెండు స్థానాలకు పడిపోవడం గమనార్హం. బుధవారం ఆయన రెండో స్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోగా.. గురువారం అది కూడా పోయి నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు. ఇక అదానీతో పాటు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ర్యాంకు సైతం పడిపోయింది. బుధవారం అదానీ వెనక్కి నెట్టి రెండో స్థానం కైవసం చేసుకున్న ఆయన తాజాగా మూడో స్థానానికి పరిమితం అయ్యారు.

నిన్నటి వరకు నాలుగో స్థానంలో ఉన్న లగ్జరీ గూడ్స్ తయారీ సంస్థ లూయిస్ వియుట్టన్ అధినేత బెర్నార్డ్ అర్నాల్డ్ ఏకంగా రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానాన్ని పదిలపర్చుకున్నారు. ఫోర్బ్స్ ప్రకటించిన తాజా జాబితాలో వీరి సందప వరుసగా లూయిస్ వియుట్టన్-141.2 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్-141.1 బిలియన్ డాలర్లు, అదానీ-134.2 బిలియన్ డాలర్లు గా ఉన్నాయి. తాజాగా అదానీ సంపద 5.7 బిలియన్ డాలర్లు నష్టపోవడంతో మూడో ర్యాంకు కోల్పోయినట్లు వెల్లడించారు.

ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో మిగిలిన వారికి దొరక్కుండా ఎప్పటిలాగే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన సంపద 263.2 బిలియన్ డాలర్లు.

Google Maps Immersive View : గూగుల్ మ్యాప్స్‌లో అద్భుతమైన ఫీచర్.. మీరు సెర్చ్ చేసే లొకేషన్ 3D ఏరియల్ లైవ్ వ్యూలో చూడొచ్చు..!