Apple Store in Delhi : ఆపిల్ రెండో స్టోర్ ప్రారంభించిన టిమ్ కుక్.. కస్టమర్లకు గ్రాండ్ వెల్‌కమ్.. ఢిల్లీ స్టోర్ స్పెషాలిటీ ఇదే..!

Apple Store in Delhi : భారత్‌లో ఎట్టకేలకు ఆపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. ముంబై స్టోర్ ప్రారంభించిన రెండు రోజుల తర్వాత ఇప్పుడు ఢిల్లీలో కూడా ఆపిల్ స్టోర్ ప్రారంభించింది. ఈ రెండు స్టోర్లను కంపెనీ సీఈఓ టిమ్ కుక్ గేటులు తెరిచి ప్రారంభించారు.

Apple Store in Delhi : ఆపిల్ రెండో స్టోర్ ప్రారంభించిన టిమ్ కుక్.. కస్టమర్లకు గ్రాండ్ వెల్‌కమ్.. ఢిల్లీ స్టోర్ స్పెషాలిటీ ఇదే..!

Apple Delhi Store _ Key things to know about Apple's second retail store in Delhi

Apple Store in Delhi : దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఆపిల్ స్టోర్ ప్రారంభమైంది. ఇప్పటికే ముంబైలో ఫస్ట్ రిటైల్ స్టోర్ ప్రారంభించిన ఆపిల్.. ఏప్రిల్ 20న (గురువారం) ఢిల్లీలోని సాకేత్‌లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో రెండో ఆపిల్ రిటైల్ స్టోర్ ఏర్పాటు చేసింది. ఈ ఆపిల్ సాకేత్ స్టోర్‌ను ఈరోజు ఉదయం 10 గంటలకు కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించారు. ఏప్రిల్ 18న ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌ (Jio World Drive)లో ప్రారంభించిన (Apple BKC) స్టోర్ తర్వాత భారత్‌లో ఇది రెండవ ఆపిల్ స్టోర్.

ఢిల్లీ స్టోర్ సాకేత్‌లోని సెలెక్ట్‌సిటీ వాక్ మాల్ మొదటి అంతస్తులో ఉంది. ఈ స్టోర్‌ను అలాగే (Apple CEO)ని చూసేందుకు ఉదయం నుంచి వందలాది మంది ఆపిల్ అభిమానులు, కస్టమర్లు ఢిల్లీ స్టోర్ వెలుపల క్యూలో నిలబడ్డారు. అధికారికంగా ఆపిల్ ఢిల్లీ స్టోర్ ప్రారంభమైన సందర్భంగా ఆపిల్ కస్టమర్‌ల తమకు నచ్చిన ఆపిల్ ప్రొడక్టులను కొనుగోలు చేసుకోవచ్చు. తద్వారా ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్‌లో ఆపిల్ తమ ఉనికిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఢిల్లీ స్టోర్.. ముంబై స్టోర్ కన్నా చాలా చిన్నదిగా ఉంటుంది. ఇప్పటికీ అన్ని ఆపిల్ ప్రొడక్టులను స్టోర్లలో ప్రదర్శిస్తుంది. ఆపిల్ BKC మాదిరిగానే ఢిల్లీ స్టోర్‌లోనూ ఆపిల్ అనేక సర్వీసులను అందిస్తుంది.

Read Also :  Apple Delhi Store : ఏప్రిల్ 20న ఆపిల్ రెండో రిటైల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. ఢిల్లీ స్టోర్ ప్రత్యేకతలివే..!

ఆపిల్ స్టోర్ ఉద్యోగుల్లో సగం మంది మహిళలే.. :
ఆపిల్ ఢిల్లీ (Apple Saket) స్టోర్‌లో పనిచేసేందుకు భారత్‌లోని 18 వివిధ రాష్ట్రాల నుంచి 70 మంది సభ్యుల సిబ్బంది ఉన్నారు. వీరంతా స్టోర్‌కు వచ్చే సందర్శకులకు గైడ్ చేస్తారు. వీరంతా దాదాపు 15 భాషలను మాట్లాడగలరు. ఈ ఉద్యోగుల్లో సగం మంది మహిళలే ఉండటం విశేషం. ఆపిల్ అద్భుతమైన బృంద సభ్యులతో స్థానిక కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యేలా వారి అభిరుచులను కొనసాగించేందుకు అద్భుతమైన ప్రొడక్టులు, సర్వీసులను అందించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఆపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓ’బ్రియన్ చెప్పారు.

Apple Delhi Store _ Key things to know about Apple's second retail store in Delhi

Apple Delhi Store _ Key things to know about Apple’s second retail store in Delhi

ఆపిల్ సాకెత్ స్టోర్‌లో ఏమి ఉంటాయంటే? :
ఆపిల్ సాకెత్ స్టోర్ సందర్శకులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ముంబై (Apple BKC) స్టోర్ మాదిరిగా కాకుండా చాలా చిన్నదిగా ఉంటుంది. అయినప్పటికీ కస్టమర్లు నిలబడేందుకు విశాలంగా ఉంటుంది. ఈ స్టోర్‌లో కంపెనీ అనేక ప్రొడక్టులు, అప్లియన్సెన్స్ ప్రదర్శించే వైట్ ఓక్ టేబుల్‌లతో ప్రత్యేకంగా రూపొందించిన కర్వడ్ స్టోర్ ఫ్రంట్ ఉంది. ఆపిల్ iPhones, MacBook, ఆపిల్ అప్లియన్స్, Apple Music, ఆపిల్ ఆర్కేడ్, (Apple TV)లకు సంబంధించి ప్రత్యేక సెక్షన్లు ఉన్నాయి.

Apple CEO Tim Cook to welcome customers at Apple Store in Delhi

Apple CEO Tim Cook to welcome customers at Apple Store in Delhi

ప్రాథమికంగా, ఢిల్లీ స్టోర్‌లో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని ప్రొడక్టులను ప్రదర్శిస్తుంది. సందర్శకులు తమకు నచ్చిన ప్రొడక్టులను ఎంచుకుని స్టోర్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇతర ఆపిల్ స్టోర్ల మాదిరిగానే, ఆపిల్ ఢిల్లీ సాకెత్ స్టోర్ కూడా 100 శాతం పునరుత్పాదక శక్తితో నడుస్తుంది. కార్బన్ న్యూట్రల్‌గా ఉంటుంది.

Apple Delhi Store _ Long Queues, Loud Cheers As Tim Cook Opens Apple Store In Delhi

Apple Delhi Store _ Long Queues, Loud Cheers As Tim Cook Opens Apple Store In Delhi

అంతేకాదు.. ఆపిల్ సాకేట్ జీనియస్ బార్‌ను కూడా కలిగి ఉంది. ఇందులో కస్టమర్లు స్టోర్ సిబ్బంది నుంచి హెల్ప్ తీసుకోవచ్చు. స్టోర్‌లో పికప్ జోన్ కూడా ఉంది. ఆపిల్ కొనుగోలుదారులు ఏదైనా ఆపిల్ ప్రొడక్టును ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేయవచ్చు. ఆయా సెక్షన్ నుంచి ప్రొడక్టులను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం భారత మార్కెట్లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ఆపిల్ ఆధిపత్యం చెలాయిస్తోంది. కౌంటర్ పాయింట్ డేటా ప్రకారం.. భారత్‌లో విక్రయించే రూ. 30వేల పైన ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో 65శాతం ఐఫోన్‌లే ఉన్నాయి.

అయినప్పటికీ.. కొంతమంది పోటీదారులతో పోల్చినప్పుడు.. దేశంలో ఆపిల్ మొత్తం మార్కెట్ వాటా ఇప్పటికీ తక్కువగానే ఉంది. ఈ రెండు స్టోర్ల ప్రారంభోత్సవంతో ఆపిల్ భారత మార్కెట్‌లోకి మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే కొన్నేళ్లలో కంపెనీ భారత్‌లో మరిన్ని స్టోర్లను ఓపెన్ చేస్తుందో లేదో చూడాలి.

Read Also : Apple Delhi Store : ఆపిల్ రెండో స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. ఢిల్లీ స్టోర్ ముందు భారీగా క్యూ కట్టిన కస్టమర్లు..!