BGMI Preload Game : ఆండ్రాయిడ్ గేమర్లకు గుడ్‌న్యూస్.. మే 29 నుంచి BGMI ప్రీలోడ్ గేమ్ ఆడొచ్చు..!

BGMI Preload Game : గేమింగ్ కంపెనీ క్రాఫ్ట్ డెవలప్ చేసిన బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI)ను ఇప్పుడు మే 27 నుంచి ఆండ్రాయిడ్ యూజర్లందరూ ప్రీలోడ్ చేయవచ్చు.

BGMI Preload Game : ఆండ్రాయిడ్ గేమర్లకు గుడ్‌న్యూస్.. మే 29 నుంచి BGMI ప్రీలోడ్ గేమ్ ఆడొచ్చు..!

BGMI preload begins for Android users, gameplay starts May 29

BGMI Preload Game begins for Android users : ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రముఖ గేమింగ్ కంపెనీ క్రాఫ్ట్ (Krafton) డెవలప్ చేసిన బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (Battlegrounds Mobile India) BGMI చివరకు యాప్ స్టోర్‌లలో తిరిగి వచ్చేసింది. ఇప్పుడు మే 27 నుంచి ఆండ్రాయిడ్ యూజర్లందరికి ఈ గేమ్ ప్రీలోడ్ చేసుకోవచ్చు. అయితే, ఆండ్రాయిడ్ గేమర్లు మే 29 నుండి మాత్రమే గేమ్ ఆడగలరు. ప్రీలోడ్ ఆప్షన్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. iOS యూజర్లు గేమ్‌ను డౌన్‌లోడ్ చేసి ఆడేందుకు మే 28 వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. కొత్త లాంచ్ గురించి మాట్లాడుతూ.. క్రాఫ్టన్ ఇండియా సీఈఓ సీన్ హ్యూనిల్ సోహ్న్ మాట్లాడుతూ.. ‘బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఇప్పుడు ప్రీలోడ్ కోసం అందుబాటులో ఉందని ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది.

ఆండ్రాయిడ్ యూజర్లకు సున్నితమైన గేమ్‌ప్లే అనుభవాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నాము. భారత్‌లోని గేమింగ్ కమ్యూనిటీ కోసం గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంలో సహకరించిన అధికారులకు, వినియోగదారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాటిల్ గ్రౌండ్స్‌లో మళ్లీ కలుద్దాం’ అని అన్నారు. కొంతమంది వినియోగదారులు ఇప్పటికే అర్ధరాత్రి నుంచి ఆటోమేటిక్ అప్‌డేట్‌ను స్వీకరించి ఉండవచ్చు. ఈ అప్‌డేట్ ప్రీలోడ్ ప్రాసెస్‌లో భాగమని చెప్పవచ్చు. దీనిపై గేమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Read Also : 2023 Komaki TN 95 : యాంటీ-స్కిడ్ టెక్నాలజీతో కొమాకి TN 95 ఎలక్ట్రిక్ స్కూటర్.. టాప్ స్పీడ్ 85కి.మీ, ధర ఎంతో తెలుసా?

ప్రతిఒక్కరికీ సున్నితమైన గేమింగ్ అనుభవాన్ని అందించేందుకు కంపెనీ BGMIని యూజర్లకు అందుబాటులోకి తీసుకోస్తోంది. గేమ్ ప్లే చేసేందుకు దశలవారీ విధానాన్ని ప్రవేశపెడుతుంది. ఈ విధానంతో ఎలాంటి అంతరాయాలు లేకుండా గేమర్లు తమ గేమ్ ఆడుకునేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. మే 29 నుంచి ప్రారంభమయ్యే బాటిల్ గ్రౌండ్స్ గేమర్లు ఉత్కంఠభరితమైన బాటిల్ గ్రౌండ్స్ గేమ్‌లో పాల్గొనవచ్చు. కొత్త అప్‌డేట్ కొత్త మ్యాప్, గేమ్‌లో ఈవెంట్‌లు మరిన్ని ఆసక్తికరమైన ఫీచర్‌లను అందిస్తుంది. గేమ్ లభ్యతతో పాటు, క్రాఫ్టన్ ‘ఇండియా కి హార్ట్‌బీట్’ అనే కొత్త మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. (BGMI)తో లోతుగా కనెక్ట్ అయ్యే గేమర్‌ల స్టోరీలను అందిస్తుంది.

BGMI preload begins for Android users, gameplay starts May 29

BGMI Preload Game begins for Android users, gameplay starts May 29

BGMI గేమ్ లాంచ్ చేసిన ఏడాది తర్వాత 100 మిలియన్ల యూజర్లకు చేరినట్టు క్రాఫ్టన్ వెల్లడించింది. టెలివిజన్‌లో టెలిక్యాస్ట్ అయ్యే ఫస్ట్ ఎస్పోర్ట్స్ ఈవెంట్‌గా అవతరించడం ద్వారా బాటిల్ రాయల్-స్టైల్ గేమ్ హిస్టరీ క్రియేట్ చేసిందని కంపెనీ తెలిపింది. 24 మిలియన్ల ఏకకాల వ్యూలతో మొత్తం 200 మిలియన్ల వ్యూయర్లను ఆకర్షించిందని తెలిపింది. గత ఏడాదిలో BGMI భద్రతా సమస్యల కారణంగా ఆపిల్ App Store, Google Play Store రెండింటి నుంచి తొలగించారు. గేమ్ మునుపటి వెర్షన్, PUBG మొబైల్, ఇలాంటి భద్రతా కారణాలు, చైనాతో అనుబంధాల కారణంగా భారత్‌లో బ్యాన్ అయింది. అదనంగా, కొంతమంది చట్టసభ సభ్యులు భారత్‌లో గేమ్ లభ్యతపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు, పిల్లలపై BGMI గేమ్ ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also : Amazon Huge Discounts : అమెజాన్‌లో 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ ఫోన్ డీల్స్ మిస్ చేసుకోవద్దు..!