Twitter: ట్విట్టర్ సీఈవో పదవికి రాజీనామా చేయనున్న మస్క్.. ఆ బాధ్యతలు ఆమెకు అప్పగించేందుకు సిద్ధం

Twitter: ట్విట్టర్ సీఈవో పదవికి రాజీనామా చేస్తానని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.

Twitter: ట్విట్టర్ సీఈవో పదవికి రాజీనామా చేయనున్న మస్క్.. ఆ బాధ్యతలు ఆమెకు అప్పగించేందుకు సిద్ధం

Elon Musk

Twitter: ట్విట్టర్ (Twitter) సీఈవో పదవికి ఎలాన్ మస్క్ (Elon Musk) రాజీనామా చేయనున్నారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి దానికి సీఈవోగా ఉంటున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.

తన మైక్రో బ్లాగింగ్ సంస్థకు కొత్త సీఈవో వస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. ఆరు వారాల్లో ఓ మహిళ ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు. అయితే, ఆమె పేరును మాత్రం ఎలాన్ మస్క్ బయటపెట్టలేదు. ట్విట్టర్ కు తాను శాశ్వత సీఈవోను కాదని ఎలాన్ మస్క్ చాలాసార్లు తెలిపారు.

ట్విట్టర్ కొత్త సీఈవోను నియమించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎలాన్ మస్క్ ఆరు నెలలుగా చెబుతున్నారు. “ట్విట్టర్ కోసం ఖర్చు చేస్తోన్న నా సమయాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నాను. ఆ బాధ్యతలను వేరే వారికి అప్పగించాలనుకుంటున్నాను” అని ఎలాన్ మస్క్ చెప్పారు.

గత డిసెంబరులోనూ ఆయన స్పందిస్తూ.. ట్విట్టర్ సీఈవోగా కొత్త వారిని నియమించి వీలైనంత త్వరగా ఈ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. కాగా, ఎన్‌బీసీ (NBC) యూనివర్సల్ ఎగ్జిక్యూటివ్ లిండా యక్కరినో ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారని ఈ మేరకు చర్చలు జరిగాయని వార్తలు వస్తున్నాయి.

ఎన్‌బీసీ (NBC) యూనివర్సల్ మీడియా గ్లోబల్ అడ్వర్‌టైజింగ్ సంస్థ. ట్విట్టర్ సీఈవోగా యక్కరినో బాధ్యతలు స్వీకరిస్తారన్న ప్రచారం జరుగుతుండడంతో ఆమె నుంచి స్పష్టత కోసం కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నించాయి. అయితే, ఆమె స్పందించలేదు.

Finland PM filed for divorce : అవును.. వాళ్లిద్దరూ విడిపోతున్నారు..