Gold-Silver Prices : పెళ్లిళ్ల సీజన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold-Silver Prices Today : ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్. బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగొచ్చాయి.

Gold-Silver Prices : పెళ్లిళ్ల సీజన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Silver Prices Gold Rates Today Fall To Near Lowest In 3 Months, Silver Prices Drop

Gold-Silver Prices Today : ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్. బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగొచ్చాయి. 22 క్యారట్ల బంగారాన్ని కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. హైదరాబాద్ నగరంలో 22 క్యారట్ల బంగారం 10 గ్రామలు ధర రూ.47,100గా ఉంది. మంగళవారంతో పోల్చితే.. రూ.400 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ లో తులం బంగారం ధర రూ.4,710గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, కేరళలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,100వరకు తగ్గింది. ఈరోజు వెండి ధర రూ.400 దిగొచ్చింది. ప్రస్తుతం తులం వెండి రూ.661గా ఉంది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, కేరళ, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలో ఎలాంటి మార్పులేదు.

హైదరాబాద్‌ నగరంలో 24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారం తులం రూ.51,380వరకు తగ్గింది. మంగళవారంతో పోల్చితే రూ.430 పడిపోయింది. భాగ్యనగరంలో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.5,138కి చేరుకుంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, కేరళలో బంగారం ధర ఒకేలా ఉంది. తులం 22 క్యారట్ల బంగారం ధర రూ.47,100గా ఉంది. ఇక 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.51,380 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.48,460కి తగ్గింది. పుణెలో రూ.47,200, జైపూర్‌లో రూ.47,660, అహ్మదాబాద్‌లో రూ.47,160, పాట్నాలో రూ.47,200, భువనేశ్వర్‌లో రూ.47,100కి అందుబాటులో ఉంది.

Gold Silver Prices Gold Rates Today Fall To Near Lowest In 3 Months, Silver Prices Drop (1)

Gold Silver Prices Gold Rates Today Fall To Near Lowest In 3 Months, Silver Prices Drop 

చెన్నైలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.52,860కి తగ్గింది. పుణెలో రూ.51,500, అహ్మదాబాద్‌లో రూ.51,440, జైపూర్‌లో రూ.51,530, పాట్నాలో రూ.51,500,  భువనేశ్వర్‌లో రూ.51,380కి అందుబాటులో ఉంది. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కామన్.. ఒక రోజు పెరిగినట్టే పెరిగి.. మళ్లీ వెంటనే తగ్గుతున్నాయి. గడిచిన 10 రోజుల్లో పసిడి ధరలు 5 సార్లు తగ్గాయి. మరో 3 సార్లు పెరిగాయి. బంగారంతో పాటు వెండి రేట్లు బాగా తగ్గాయి. నెలవారీ అమెరికా ద్రవ్యోల్బణం డేటా కంటే ముందు భారత మార్కెట్లో బంగారం ధరలు దాదాపు 3 నెలల కనిష్టానికి పడిపోయాయి. ఇది ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరిపై కొంత ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు.

Read Also : Gold Prices Rise: బంగారం ధరకు రెక్కలు: ఒక్కరోజులో రూ.1200 పైకి