అడ్రస్ ప్రూఫ్ లేకుండానే కొత్త ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్.. ఎలానంటే?

అడ్రస్ ప్రూఫ్ లేకుండానే కొత్త ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్.. ఎలానంటే?

No address proof for small 5kg FTL Cylinders : వంటగ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. కొత్త అద్దెంట్లోకి మారారా? కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నారా? అయితే అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఎల్ పీజీ గ్యాస్ కనెక్షన్ తీసుకోవచ్చు. అందరికి కాదండోయ్.. చిన్న(Chhotu) 5 కేజీల FTL సిలిండర్ వినియోగదారులకు మాత్రమేనంట.. ఇండియన్ ఆయిల్ కంపెనీ Chhotu 5kg FTL (ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ) సిలిండర్లపై ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ అక్కర్లేదు అంటోంది.

ఇండేన్ గ్యాస్ కనెక్షన్ పంపిణీదారుల ద్వారా ఇండియన్ ఆయిల్ కొత్త చిన్న సిలిండర్లను కస్టమర్లు తీసుకోవవచ్చుంట. ఇండియన్ ఆయిల్ రిటైల్ ఔట్ లెట్స్, కిరాణా స్టోర్లు, స్థానిక సూపర్ మార్కెట్లలో కూడా ఈ చిన్న గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉంటాయట.. ఈ సిలిండర్లను కస్టమర్లకు ప్రాతిపాదికన విక్రయిస్తారు. కస్టమర్లు కేవలం ఐడెంటిటీ ప్రూఫ్ సమర్పిస్తే చాలు.. సులభంగా 5కేజీల సిలిండర్ తీసేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా ఎక్కడైనా పాయింట్ ఆఫ్ సేల్ (POS) డిస్ట్రిబ్యూటర్ల దగ్గర 5కేజీల FTL సిలిండర్లను రీఫిల్ చేయించుకోవచ్చు. కస్టమర్లలో ఎవరైనా ఒక్కో సిలిండర్ పై రూ.500 ఫిక్స్ డ్ అమౌంట్ తో POS నుంచి కొనుగోలు చేయొచ్చు. 5kg FTL సిలిండర్ కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు.

దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ Chhotu సిలిండర్లు ఇండేన్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా కొనుగోలుచేసే కస్టమర్లకు హోం డెలివరీ సౌకర్యం కూడా ఉంది. ఒక్కో సిలిండర్ రీఫిల్ పై అదనంగా డెలివరీ ఛార్జ్ (డిసెంబర్ 1st, 2020) రూ.25వరకు చెల్లించాల్సి ఉంటుంది.