iPhone 12 Pro : అమెజాన్‌ బిగ్ డీల్.. ఐఫోన్ 12ప్రోపై రూ.25వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్!

ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 12 ప్రో (iPhone 12pro) కొనేవారికి బిగ్ డీల్ అందిస్తోంది అమెజాన్. స్మార్ట్ ఫోన్ల సేల్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

iPhone 12 Pro : అమెజాన్‌ బిగ్ డీల్.. ఐఫోన్ 12ప్రోపై రూ.25వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్!

Iphone 12 Pro Selling At A Discount Of Rs 25,000 On Amazon, Check Out The Deal

iPhone 12 Pro : ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 12 ప్రో (iPhone 12pro) కొనేవారికి బిగ్ డీల్ అందిస్తోంది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్. అమెజాన్ స్మార్ట్ ఫోన్ల సేల్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 12 ప్రో
వేరియంట్‌పై అమెజాన్ రూ.25వేలు వరకు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మరిన్ని స్టోరేజీ వేరియంట్లపై కూడా భారీ ఆఫర్లను అందిస్తోంది. అంతేకాదు.. ఎక్స్ఛేంజ్ బోన‌స్ కింద రూ 15,000 వరకు తగ్గింపు పొందవచ్చు. పాత ఫోన్ల‌ను ఎక్స్ఛేంజ్
చేసుకునే వారికి iPhone 12 Pro త‌క్కువ ధ‌ర‌కే సొంతం చేసుకోవచ్చు. 2020 ఏడాదిలో ఐఫోన్ 12 సిరీస్ మార్కెట్లోకి రిలీజ్ అయింది. iPhone 12, iPhone 12pro, iPhone 12pro Max వంటి ఫోన్లు మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి.

అమెజాన్‌లో రూ 1,19,000 ఖ‌రీదైన ఐఫోన్ 12pro 128GB రూ 95,900కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్లపై రూ. 25,000 డిస్కౌంట్‌ ఆఫర్ చేస్తోంది అమెజాన్. అలాగే పాత ఫోన్ల‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.14,900 తగ్గిస్తుంది. ప్ర‌స్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్‌ఫోన్ల‌లో ఐఫోన్ 12ప్రొ అత్యంత ఆదరణ పొందింది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.1 అంగుళాల సిరామిక్ షీల్డ్ కోటింగ్‌తో వచ్చింది. 12 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు సూప‌ర్ రెటీనా XDR డిస్‌ప్లే, A14 బ‌యోనిక్ చిప్‌, 12MP అల్ట్రా వైడ్‌, వైడ్‌, టెలిఫోటో కెమెరాలు, 4x ఆప్టిక‌ల్ జూమ్ రేంజ్, IP68 వాటర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్ల‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి.

నైట్ మోడ్‌, డీప్ ఫ్యూజ‌న్‌, స్మార్ట్ HDR3, 4K Dolby విజ‌న్ HDR రికార్డింగ్‌ ఉన్నాయి. iPhone 12 Pro 128GB ధర డిస్కౌంట్ ధరతో రూ. 95,900కి విక్రయిస్తోంది అమెజాన్. మార్కెట్లో దీని అసలు ధర రూ.1,19,000గా ఉంది. అలాగే 256GB ఐఫోన్ 12ప్రోను రూ. 99,900కి కొనుగోలు చేయవచ్చు. 512GB రూ. 1,07,900 ధరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ వేరియంట్ల అన్నింటిపై రూ.25,000 వరకు డిస్కౌంట్ తగ్గింపు అందిస్తోంది. మీరు iPhone 12 Proతో పాటు AirPods ప్రోని కూడా కొనుగోలు చేయవచ్చు. దీని ధర అమెజాన్‌లో రూ. 1,15,395 మాత్రమే. వాస్తవానికి ఈ డివైజ్ ధర సుమారు రూ. 1,44,800 వరకు ఉంటుంది, కానీ, ప్రస్తుత డిస్కౌంట్ ఆఫర్ కొనుగోలు చేస్తే రూ. 28,910 వరకు సేవ్ చేసుకోవచ్చు.

Read Also : Reliance Jio Offer : జియో బంపర్ ఆఫర్.. ఆ ప్లాన్లపై 20శాతం డిస్కౌంట్!