Jio Bharat B1 4G Launch : భలే ఉంది భయ్యా.. సరసమైన ధరకే జియో భారత్ B1 4G ఫోన్ ఇదిగో.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!
Jio Bharat B1 4G Launch : కొత్త ఫీచర్ కోసం చూసే జియో యూజర్లకు (Jio Users) పండుగే.. సరసమైన ధరకే జియో భారత్ B1 4G ఫోన్ లాంచ్ అయింది. ధర, ఫీచర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.

Jio Bharat B1 4G Pre-Installed JioPay Launched in India, Price, Specifications telugu
Jio Bharat B1 4G Launch : కొత్త ఫీచర్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అత్యంత సరసమైన ధరలో రిలయన్స్ జియో (Reliance Jio) నుంచి కొత్త 4G ఫీచర్ (Jio Bharat B1) ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో అక్టోబర్ 12న అధికారికంగా ఈ 4G ఫోన్ లాంచ్ అయింది.
(Jio V2 Series) సిరీస్, (Jio K2 Karbonn) వంటి సరసమైన ఫీచర్ ఫోన్‌లలో జియో లేటెస్ట్ ఫోన్ ఇదే.. అయితే, జియో B1 వేరియంట్, మరో సిరీస్‌లో భాగంగా అధికారిక వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. భవిష్యత్తులో ఇదే లైనప్‌లో మరిన్ని మోడల్‌లు ఉండవచ్చని కంపెనీ సూచిస్తుంది. కొత్తగా లాంచ్ అయిన ఈ 4G ఫోన్ అనేక జియో అప్లికేషన్‌లతో ప్రీ-ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. మల్టీ భారతీయ ప్రాంతీయ భాషలకు సపోర్టు ఇస్తుంది.
భారత్‌లో జియో Bharat B1 4G ధర, లభ్యత :
సింగిల్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉన్న జియో భారత్ B1 4G ఫోన్ ధర రూ. 1,299 కాగా, అధికారిక జియో వెబ్‌సైట్ (jio.com), అమెజాన్ (Amazon.in) ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా, (Jio Bharat V2), (Jio Bharat K2 Karbonn) రెండింటి ఫోన్ ధర రూ. 999గా నిర్ణయించింది.
జియో భారత్ B1 4G స్పెసిఫికేషన్స్ :
జియో భారత్ B1 ఫోన్ 2.4-అంగుళాల QVGA దీర్ఘచతురస్రాకార డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఫీచర్ ఫోన్ Threadx RTOSతో రన్ అవుతుంది. 0.05GB RAMతో వస్తుంది. ఈ ఫోన్‌లో ఒకే నానో SIM ఉంది. బ్లూటూత్, Wi-Fi, USB కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది.
జియో ఫోన్ 4G కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 128GB వరకు విస్తరించగలమెమరీని కలిగి ఉంది. 2,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. గరిష్టంగా 343 గంటల వరకు స్టాండి బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. జియో భారత్ B1లో బ్యాక్ కెమెరా యూనిట్ కూడా ఉంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో అమర్చబడి ఉంది. జియో ఫోన్ 110 గ్రాముల బరువు, పరిమాణం (125mm x 52mm x 17mm) ఉంటుంది.

Jio Bharat B1 4G Launch
జియో లేటెస్ట్ ఫీచర్ ఫోన్ మల్టీ భారతీయ ప్రాంతీయ భాషలతో సహా 23 భాషలకు సపోర్టు ఇస్తుంది. మూవీలు, టీవీ సిరీస్‌లు, క్రీడలు, మ్యూజిక్ వంటి ఎంటర్‌టైన్మెంట్ కోసం (JioCinema), (JioSaavn)తో ప్రీ- ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. జియో Bharat B1 ఇంటర్నల్ (JioPay)తో వస్తుంది. వినియోగదారులు UPI పేమెంట్లు చేయడానికి ఈ యాప్ అనుమతిస్తుంది.
జియో భారత్ B1 స్పెసిఫికేషన్లు ఇవే :
డిస్‌ప్లే : 2.4-అంగుళాల QVGA దీర్ఘచతురస్రాకార స్క్రీన్
ఆపరేటింగ్ సిస్టమ్ : Threadx RTOS
కొలతలు : 125mm x 52mm x 17mm
ర్యామ్ (RAM) : 0.05GB
ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ : 128GB వరకు మైక్రో SD కార్డ్‌లకు సపోర్టు ఇస్తుంది
బ్యాటరీ : 2,000mAh బ్యాటరీ 343 గంటల వరకు స్టాండ్‌బై లైఫ్
కెమెరా : బ్యాక్ కెమెరా యూనిట్
బరువు : 110 గ్రాములు
కనెక్టివిటీ : 3.5mm హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్, Wi-Fi, USBకి సపోర్టు