JioAirfiber Connection : జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్.. కొత్త ప్లాన్లు ఏంటి? ధర ఎంత? ఎలా బుక్ చేసుకోవాలంటే? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

JioAirfiber Connection : రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్ జియో ఎయిర్‌ఫైబర్‌ (JioAirfiber Launch)ను 8 భారతీయ నగరాల్లో ప్రారంభించింది. జియో ఎయిర్‌ఫైబర్ హై-స్పీడ్ ఇంటర్నెట్, ఓవర్-ది-టాప్ (OTT) స్ట్రీమింగ్ సర్వీసులకు యాక్సెస్‌తో 6 ప్లాన్‌లను అందిస్తోంది.

JioAirfiber Connection : జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్.. కొత్త ప్లాన్లు ఏంటి? ధర ఎంత? ఎలా బుక్ చేసుకోవాలంటే? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

How to get JioAirfiber Connection _ Installation process, prices, plans and other details

Updated On : October 10, 2023 / 6:50 PM IST

JioAirfiber Connection : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స జియో (Reliance Jio) అందించే సర్వీసుల్లో (JioAirFiber) అనేది జియో కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్ ఒకటి. ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ చేసింది. హోం ఎంటర్‌టైన్మెంట్, స్మార్ట్ హోమ్ సర్వీసులు, హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ అవసరాలను తీర్చడానికి రూపొందించింది.

భారత్ అంతటా హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే లక్ష్యంతో జియో ఎయిర్‌ఫైబర్ మొదట 8 నగరాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణే నగరాల్లో ప్రారంభమైంది. జియో ఎయిర్‌ఫైబర్ పేరంట్ కంట్రోల్స్, Wi-Fi 6కి సపోర్టు, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌వాల్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది. మీరు కొత్త (Jio AirFiber Launch) కనెక్షన్‌ని పొందాలని కూడా ఆలోచిస్తున్నట్లయితే.. మీకోసం స్టెప్ బై స్టెప్ గైడ్ అందుబాటులో ఉంది.

Read Also : Honda Hness CB350 Launch : పండుగ సీజన్‌లో హోండా స్పెషల్ ఎడిషన్ CB350 మోడల్స్.. దిమ్మతిరిగే ఫీచర్లు, ధర ఎంతంటే?

జియో ఎయిర్‌ఫైబర్ బుకింగ్ ప్రాసెస్ ఇదిగో :
జియో ఎయిర్‌ఫైబర్ (JioAirfiber) కనెక్షన్‌ని ఎలా బుక్ చేసుకోవాలంటే?
Initiate Booking : మీ ప్రాంతంలో జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసు అందుబాటులో ఉందో లేదో నిర్ధారించుకోవాలి. మీరు జియో వెబ్‌సైట్‌ని విజిట్ చేయడం ద్వారా, (My Jio) యాప్‌లో లేదా జియో కస్టమర్ సపోర్ట్‌ని సంప్రదించడం చేయొచ్చు.
Register for JioAirFiber : కొత్త కనెక్షన్‌ని బుక్ చేయడానికి మీరు ఏదైనా ఒక ఆప్షన్ ఫాలో చేయొచ్చు.
– WhatsApp ద్వారా బుకింగ్ చేసుకునేందుకు 60008-60008కి మిస్డ్ కాల్ ఇవ్వండి.
– (jio.com)లో అధికారిక జియో వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
– జియో యాప్‌ని విజిట్ చేయండి.
– మీరు వ్యక్తిగతంగా మీ సమీప జియో స్టోర్‌కు వెళ్లవచ్చు.
జియో ఎయిర్‌ఫైబర్ రిజిస్టర్ చేయండి : అవసరమైన వివరాలను సమర్పించడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.
Await Confirmation : సమర్పించిన తర్వాత మీ భవనం లేదా ప్రదేశంలో సర్వీసులు అందుబాటులోకి వచ్చిన వెంటనే జియో మిమ్మల్ని సంప్రదిస్తుంది. ఒకసారి బుక్ చేసిన తర్వాత, మీరు WiFi రూటర్, 4K స్మార్ట్ సెట్-టాప్ బాక్స్, వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్‌తో కూడిన మీ జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్‌ని అందుకోవచ్చు.

How to get JioAirfiber Connection _ Installation process, prices, plans and other details

How to get JioAirfiber Connection

జియో ఎయిర్‌ఫైబర్ ఇన్‌స్టాలేషన్ ధరలు :
జియో ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా (AirFiber) కనెక్షన్‌ని అందిస్తుంది. వినియోగదారులు (Jio AirFiber) ప్లాన్‌లు, ఇన్‌స్టాలేషన్ ఫీజు కోసం మాత్రమే చెల్లించాలి.

జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్లు ఇవే :
జియో ఎయిర్‌ఫైబర్ ప్రారంభంతో, కంపెనీ వేగవంతమైన ఇంటర్నెట్‌తో 6 (AirFiber) ప్లాన్‌లను కూడా ప్రవేశపెట్టింది. మరెన్నో బెనిఫిట్స్ అందిస్తోంది. జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌లు, ఎయిర్‌ఫైబర్, ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ ప్లాన్‌లు అనే రెండు కేటగిరీల కింద వస్తాయి.

జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌లు : ఈ కేటగిరీలో జియో వరుసగా రూ. 599, రూ. 899, రూ. 1199 ధరలతో 3 ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లలో గరిష్టంగా 100Mbps ఫాస్ట్-స్పీడ్ ఇంటర్నెట్ డేటా, 550కి పైగా డిజిటల్ ఛానల్‌లు, 14 OTT యాప్‌లకు యాక్సెస్ వంటి అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి. రూ.1199 ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), జియోసినిమా (JioCinema) ప్రీమియం ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.

(Jio AirFiber Max) ప్లాన్‌లు : ఈ కేటగిరీలో జియో వరుసగా రూ. 1499, రూ. 2499, రూ. 3999 ధరలతో 3 ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లు గరిష్టంగా 1Gbps ఇంటర్నెట్ డేటా స్పీడ్, 550కి పైగా డిజిటల్ ఛానల్‌లు, Netflix, Amazon Prime, JioCinema ప్రీమియం వంటి 14 OTT యాప్‌లకు యాక్సెస్‌తో సహా అదనపు బెనిఫిట్స్ అందిస్తాయి. ముఖ్యంగా, ఎంపిక చేసిన ప్రాంతాలలో జియో ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ అందుబాటులో ఉంటుంది.

Read Also : Beggar buying iPhone 15 Pro : ఐఫోన్ కొనేందుకు స్టోర్‌కి వెళ్లిన బిచ్చగాడు.. అన్ని పైసలు ఎలా అంటే..