Johnson & Johnson : బేబీ పౌడర్ వల్లనే కేన్సర్ వచ్చింది…పరిహారం చెల్లించాలని జాన్సన్ అండ్ జాన్సన్‌కు జ్యూరీ ఆదేశం

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి ఓక్లాండ్‌లోని కాలిఫోర్నియా రాష్ట్ర కోర్టు షాక్ ఇచ్చింది. బేబీ పౌడర్ వల్ల కేన్సర్ వచ్చిన ఎమోరీ హెర్నాండెజ్ వాలాడెజ్‌కు 18.8 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని జ్యూరీ సంచలన ఆదేశాలు జారీ చేసింది....

Johnson & Johnson : బేబీ పౌడర్ వల్లనే కేన్సర్ వచ్చింది…పరిహారం చెల్లించాలని జాన్సన్ అండ్ జాన్సన్‌కు జ్యూరీ ఆదేశం

Johnson & Johnson baby powder

Johnson & Johnson : జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి ఓక్లాండ్‌లోని కాలిఫోర్నియా రాష్ట్ర కోర్టు షాక్ ఇచ్చింది. బేబీ పౌడర్ వల్ల కేన్సర్ వచ్చిన ఎమోరీ హెర్నాండెజ్ వాలాడెజ్‌కు 18.8 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని జ్యూరీ సంచలన ఆదేశాలు జారీ చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ (Johnson & Johnson) బేబీ పౌడర్‌ వాడటం వల్లనే తనకు కేన్సర్ వచ్చిందని పేర్కొన్న వ్యక్తికి 18.8 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. (cancer from baby powder)

Seema Haider : సీమా హైదర్‌ను పాక్ సరిహద్దుల్లో విసిరేస్తాం : కర్ణిసేన హెచ్చరిక

తనకు నష్టపరిహారం ఇవ్వాలని ఎమోరీ హెర్నాండెజ్ వాలాడెజ్ గత సంవత్సరం కాలిఫోర్నియా రాష్ట్ర కోర్టు దావా వేశారు. హెర్నాండెజ్ చిన్నతనం నుంచి జాన్సన్ అండ్ జాన్సన్ పౌడరును ఎక్కువగా వాడటం వల్ల తన గుండె చుట్టూ ఉన్న కణజాలంలో మెసోథెలియోమా అనే ప్రాణాంతక కేన్సర్‌ను అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

Seema Haider : సీమా హైదర్ సోదరుడు, మామ పాక్ ఆర్మీలో…షాకింగ్ నిజం

హెర్నాండెజ్ వైద్యబిల్లులు, నొప్పి, బాధల కోసం నష్టపరిహారానికి అర్హుడని జ్యూరీ తేల్చిచెప్పింది. ఈ కేసు తీర్పుపై తాము అప్పీలు చేస్తామని జాన్సన్ అండ్ జాన్సన్ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ హాస్ చెప్పారు. హెర్నాండెజ్ తల్లి అన్నాకమాచో విలపిస్తూ తన కుమారుడి అనారోగ్యం గురించి చెప్పింది.