McLaren Luxury Cars : భారత్‌కు ‘మెక్‌లారెన్‌’ సూపర్‌ లగ్జరీ కార్లు వచ్చేస్తున్నాయి.. ఎప్పుడంటే?

McLaren Luxury Cars : బ్రిటిష్ సూపర్ కార్ల తయారీ సంస్థ మెక్‌లారెన్ (McLaren Luxury Cars) ఆటోమోటివ్ భారత మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు అధికారికంగా ధృవీకరించింది.

McLaren Luxury Cars : భారత్‌కు ‘మెక్‌లారెన్‌’ సూపర్‌ లగ్జరీ కార్లు వచ్చేస్తున్నాయి.. ఎప్పుడంటే?

McLaren confirms India entry, launch in second half of 2022

McLaren Luxury Cars : బ్రిటిష్ సూపర్ కార్ల తయారీ సంస్థ మెక్‌లారెన్ (McLaren Luxury Cars) ఆటోమోటివ్ భారత మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు అధికారికంగా ధృవీకరించింది. మెక్‌లారెన్‌కు భారత్ 41వ మార్కెట్ కేంద్రంగా మారనుంది. వచ్చే అక్టోబర్‌లో ముంబైలోని ఫస్ట్ డీలర్ ప్రారంభించనుంది. కంపెనీ నిర్ణయంతో భారత రహదారులపై ఈ సూపర్‌ లగ్జరీ కార్లు (Super luxary cars) రయ్‌ రయ్‌మమని దూసుకెళ్లనున్నాయి. ఇప్పటివరకు 40 దేశాల్లో తమ బ్రాండ్లను ఆటోమొబైల్‌ సంస్థ విక్రయిస్తోంది. తాజాగా భారత్‌ను 41వ మార్కెట్ కేంద్రంగా ఎంచుకుంది.

McLaren confirms India entry, launch in second half of 2022

McLaren confirms India entry, launch in second half of 2022

దేశంలోని కస్టమర్లు కంపెనీ లైనప్‌లోని ప్రతి మోడల్‌ను కొనుగోలు చేసేలా డీలర్ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తారని మెక్‌లారెన్ ధృవీకరించింది. మెక్‌లారెన్ ఆటోమోటివ్ అనేది బ్రూస్ మెక్‌లారెన్ స్థాపించిన మెక్‌లారెన్ ఫార్ములా 1 బృందానికి చెందిన బ్రాండ్. సూపర్ కార్ల తయారీ సంస్థ గత కొన్ని దశాబ్దాల్లో మెక్‌లారెన్ కార్స్ బ్రాండ్ స్థానంలో మెక్‌లారెన్ ఆటోమోటివ్‌గా వచ్చింది. దిగ్గజ మెక్‌లారెన్ F1 తయారీదారుగా ప్రసిద్ధి చెందింది. బ్రాండ్ ప్రపంచంలోని ప్రధాన తయారీదారులలో ఒకటిగా అవతరించింది. మెక్‌లారెన్ కార్లను యూకేలోని సర్రేలోని వోకింగ్‌లో మెక్‌లారెన్ టెక్నాలజీ సెంటర్‌లో అభివృద్ధి చేస్తుంది. టెక్నాలజీ సెంటర్‌లో మెక్‌లారెన్ ఫార్ములా 1 జట్టు కూడా ఉంది.

McLaren confirms India entry, launch in second half of 2022

McLaren confirms India entry, launch in second half of 2022

ఇది ఫార్ములా 1 చరిత్రలో రెండవ అత్యంత సక్సెస్ సాధించిన టీమ్. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని రిటైల్‌ నెట్‌వర్క్‌ విస్తరణలో భాగంగా భారత్‌ను కీలక మార్కెట్‌గా మెక్‌లారెన్‌ భావిస్తోంది. అక్టోబర్‌ నుంచి ముంబైలో లగ్జరీ కార్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఆసియా ప‌సిఫిక్‌, చైనా ఎండీ, డైరెక్టర్‌ పాల్‌ హారిస్ తెలిపారు. ఆర్టురాను భారత్‌లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. సరికొత్త హై-పెర్ఫార్మెన్స్‌ హైబ్రిడ్‌ సూపర్‌ కారుగా కంపెనీ వెల్లడించింది. ముంబై రిటైల్‌ కేంద్రంలో మెక్‌లారెన్‌ జీటీ, హె-పెర్ఫార్మెన్స్‌ హైబ్రిడ్‌- ఆర్టురా, 600LT, 720S కూప్‌, స్పైడర్‌తో పాటు 765LT మోడల్స్‌ అందుబాటులోకి రానున్నాయి.

Read Also : Poco M5 4G in India : పోకో M5 4G స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది.. వచ్చే నెలలోనే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?