సెప్టెంబర్ 29 నుంచి సేల్ : MG Hector బుకింగ్ రీఓపెన్ 

బ్రిటీష్ స్పోర్ట్స్ కారు మేకర్ MG మోటార్ నుంచి జూన్ 27న ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఎంజీ హెక్టార్ కారు బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

  • Published By: sreehari ,Published On : September 26, 2019 / 01:47 PM IST
సెప్టెంబర్ 29 నుంచి సేల్ : MG Hector బుకింగ్ రీఓపెన్ 

బ్రిటీష్ స్పోర్ట్స్ కారు మేకర్ MG మోటార్ నుంచి జూన్ 27న ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఎంజీ హెక్టార్ కారు బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

బ్రిటీష్ స్పోర్ట్స్ కారు మేకర్ MG మోటార్ నుంచి జూన్ 27న ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఎంజీ హెక్టార్ కారు అతి త్వరలో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 29 నుంచి బుకింగ్స్ రీఓపెన్ కానున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. SUV మోడల్ కార్లలో ఎంతో పాపులర్ అయిన MG Hector కారు యూనిట్లు అత్యధికంగా అమ్ముడుబోయాయి. రెండు నెలల్లో ప్రారంభం నుంచి 3వేల 5వందలకు పైగా యూనిట్లు విక్రయించింది. అందులో వరుసగా జూలైలో 1,508 యూనిట్లు.. ఆగస్టులో ఏకంగా 2వేల 018 యూనిట్ల వరకు విక్రయించింది. జూలై ప్రారంభంలో అత్యధికంగా డిమాండ్ కారణంగా MG (మోరీస్ గారేజ్) బుకింగ్స్ ను కంపెనీ నిలిపివేసింది. అప్పటి నుంచి MG SUV కోసం ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 

సెప్టెంబర్ 29 నుంచి MG మోటార్ MG Hector కారు బుకింగ్స్ తిరిగి ప్రారంభించనున్నట్టు ఆటో కార్ ఇండియా రిపోర్టులో తెలిపింది. ఇండియాలో జూన్ 4న ఎంజీ హెక్టార్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. SUV కారు లాంచ్ అయినప్పటి నుంచి 10వేలకు పైగా కార్లు బుకింగ్ కాగా.. బుకింగ్స్ నిలిపివేసే సమయానికి మొత్తంగా 28వేల బుకింగ్స్ నమోదు అయినట్టు కంపెనీ వెల్లడించింది.

వెయిటింగ్ లిస్టులో ఉన్న కస్టమర్లలో అదనంగా 11వేల మందిని కూడా యాడ్ చేసింది. MG Hector కారు (ఎక్స్-షోరూం)తో కలిపి రూ.12.18 లక్షలతో అందుబాటులో ఉంది. మరో వేరియంట్ కారు ధర (ఎక్స్-షోరూంతో కలిపి) రూ.16.88లక్షల ధర పలుకుతోంది. ఇతర పోటీదారులైన కియా సెల్టాస్, టాటా హరియర్, మహీంద్రా XUV500, జీప్ కంపాస్ కారు మేకర్లతో పోటీగా ఎంజీ హెక్టార్ మార్కెట్లో దిగింది.