Airtel Xstream Fiber Lite : అత్యంత సరసమైన ధరకే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్.. హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!
Airtel Xstream Fiber Lite : ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. అత్యంత సరసమైన ధరకే హైస్పీడ్ ఇంటర్నెట్ పొందాలంటే ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి.

New Airtel Xstream Fiber broadband lite plan launched at Rs 219_ benefits and other details
Airtel Xstream Fiber Lite : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel) ఇటీవలే ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల కోసం అత్యంత సరసమైన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ. 219 ధరకు సరికొత్త ప్లాన్‌ను ‘బ్రాడ్‌బ్యాండ్ లైట్’ ప్లాన్ అనే పేరుతో తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న చౌకైన (Airtel Xstream) ఫైబర్ ప్లాన్‌గా అందిస్తోంది.
ఈ ప్లాన్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు అదనపు డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. బ్రాడ్‌బ్యాండ్ సెక్షన్‌లో బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎయిర్‌టెల్ లేటెస్ట్ ఆఫర్‌లో చేర్చిన అన్ని బెనిఫిట్స్ గురించి వివరంగా పరిశీలిద్దాం.
ఎయిర్‌టెల్ Xstream బ్రాడ్‌బ్యాండ్ లైట్ ప్లాన్ వివరాలివే :
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్ లైట్ ప్లాన్ నెలకు రూ. 219 చెల్లించాలి. వార్షిక సభ్యత్వానికి మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. అంటే.. వినియోగదారులు ప్లాన్ కోసం సైన్ అప్ చేసేందుకు మొత్తం రూ.3,101 చెల్లించాల్సి ఉంటుంది. బెనిఫిట్స్ విషయానికొస్తే.. కొత్త లైట్ ప్లాన్ యూజర్లకు 10Mbps బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌ని అందిస్తుంది. అంతేకాదు.. ఫ్రీ రూటర్ కూడా పొందవచ్చు.
91 మొబైల్స్ ప్రకారం.. కొత్త ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ లైట్ ప్లాన్.. బీహార్, ఉత్తరప్రదేశ్ తూర్పు, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా OTT లేదా లైవ్ టీవీ బెనిఫిట్స్ పొందలేరు. దేశంలోని ఇతర నగరాల్లో ఈ ఫైబర్ లైట్ ప్లాన్ ఎప్పుడు అందుబాటులోకి రానుంది అనేదానిపై క్లారిటీ లేదు.
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లివే :
ఎయిర్‌టెల్ అందించే మరిన్ని బెనిఫిట్స్ కలిగిన ఇతర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల కోసం చూస్తున్నారా? ఇతర Xstream ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో కూడా ఎంచుకోవచ్చు. ఇతర ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్లలో స్పీడ్, అనేక ఆఫర్లతో ప్లాన్‌లను అందిస్తుంది. ప్రైమరీ ప్లాన్‌కు నెలకు రూ. 499 చెల్లించాలి. ఈ ప్లాన్ ద్వారా గరిష్టంగా 40 Mbps స్పీడ్, అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, ఫోన్ కాల్‌లు, Apollo 24/7, FASTag, Wynk మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు.

New Airtel Xstream Fiber broadband lite plan launched at Rs 219
స్టాండర్డ్ ప్లాన్‌కు నెలకు రూ. 799 చెల్లించాలి. ఈ ప్లాన్‌తో 100 Mbps స్పీడ్‌తో పాటు Xstream ప్రీమియం ప్యాక్‌కు సభ్యత్వాన్ని అందిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌కు నెలకు రూ. 999 చెల్లించాలి. డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ప్యాక్‌లకు గరిష్టంగా 200 Mbps స్పీడ్ మరెన్నో సబ్‌స్క్రిప్షన్‌లు పొందవచ్చు. అలాగే, ప్రొఫెషనల్ ప్లాన్.. ఈ ప్లాన్‌కు నెలకు రూ. 1,498 చెల్లించాలి. తద్వారా గరిష్టంగా 300 Mbps స్పీడ్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
అత్యంత ఖరీదైన ప్లాన్ ధర నెలకు రూ. 3,999 చెల్లించాలి. తద్వారా గరిష్టంగా 1Gbps స్పీడ్‌తో అన్ని బెనిఫిట్స్ అందిస్తుంది. అంతకుముందు, ఎయిర్‌టెల్ పోటీదారు రిలయన్స్ జియో (Reliance Jio) కూడా గత నెలలో బ్రాడ్‌బ్యాండ్ బ్యాకప్ ప్లాన్ అనే బడ్జెట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ధర నెలకు రూ. 198, అత్యధిక ఇంటర్నెట్ స్పీడ్ 10 Mbps అందిస్తుంది.
ఎయిర్‌టెల్ యూజర్లు తమ ఇంటర్నెట్ స్పీడ్‌ని అప్‌గ్రేడ్ చేసేందుకు అదనంగా చెల్లించడం ద్వారా OTT బెనిఫిట్స్ పొందే అవకాశం కూడా ఉంది. Jio బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు 30 లేదా 100 Mbpsకి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా STB, గరిష్టంగా 500 లైవ్ టీవీ ఛానెల్‌లు, గరిష్టంగా 14 OTT యాప్‌లను పొందవచ్చు.