New Tyres : అక్టోబర్ 1 నుంచి కొత్త రకం టైర్లు వాడాల్సిందే… కేంద్రం కొత్త నిబంధనలు విడుదల

అక్టోబర్ 1 నుంచి దేశంలో ప్రయాణించే కార్లు, ట్రక్కులు, బస్సులకు కేంద్రం కొత్తగా విడుదల చేసిన ప్రమాణాలతో తయారు చేసిన టైర్లనే వాడాలాని కేంద్ర రహదారి, రవాణా శాఖ నిర్దేశించింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

New Tyres : అక్టోబర్ 1 నుంచి కొత్త రకం టైర్లు వాడాల్సిందే… కేంద్రం కొత్త నిబంధనలు విడుదల

New Designed Tyres

New Tyres : అక్టోబర్ 1 నుంచి దేశంలో ప్రయాణించే కార్లు, ట్రక్కులు, బస్సులకు కేంద్రం కొత్తగా విడుదల చేసిన ప్రమాణాలతో తయారు చేసిన టైర్లనే వాడాలాని కేంద్ర రహదారి, రవాణా శాఖ నిర్దేశించింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇకపై కొత్త రోలింగ్ రెసిస్టేన్స్ వెట్ గ్రిప్, రోలింగ్ సౌండ్ ఎమిషన్, విషయాల్లో ఆటో మోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ 142.2019 లో నిర్దేశించినట్లుగా ఉఁడాలని కేంద్రం పేర్కోంది. ప్యాసింజర్ కార్లు, లైట్ ట్రక్కలు, ట్రక్కులు బస్సులకు  ఈ నిబంధనలు  వర్తిస్తాయని తెలిపింది. వాహానాలు రహదారుల మీద వెళ్లేప్పుడు రోడ్డును పట్టుకుని ఉండటం (రోలింగ్ రెసిస్టెన్స్) తడి రోడ్లపై జారిపోకుండా ఉండటం(వెట్ గ్రిప్) శబ్దం వెలువరించటం(సౌండ్ ఎమిషన్) కొత్త నిబంధనల ప్రకారం ఉండాలని కేంద్ర పేర్కోంది.

ఈ నిబంధనల అమలుతో భారత్ కూడా యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ కమీషన్ ఫర్ యూరప్ స్ధాయి ప్రమాణాలను ఆచరణలోకి తెచ్చినట్లు అవుతుందని తెలిపింది. టైర్ల్ రోలింగ్ రెసిస్టెన్స్ లో మార్పులు చేయటం వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది. వెట్ గ్రిప్ మార్పుల వల్ల టైర్ల బ్రేకింగ్ సామర్ధ్య పెరిగి రోడ్డు మీద తడి ఉన్నప్పుడు ప్రమాదాలు తగ్గుతాయి అని కేంద్రం పేర్కోంది. ఇప్పటికే వాడుకలో ఉన్నపాత డిజైన్ల టైర్లు 2023 ఏప్రిల్ 1 నుంచి రోలింగ్ రెసిస్టెన్స్, వెట్ గ్రిప్ ప్రమాణాలను, అదే ఏడాది జూన్ 1 నుంచి సౌండ్ ఎమిషన్ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

ఐరోపాలో టైర్ లేబులింగ్ రెగ్యులైజేషన్ 2012 నుండి అమలులో ఉంది. గత సంవత్సరం, మన దేశంలో Ceat  కంపెనీ… టైర్ పరిశ్రమలో ప్రబలంగా ఉన్న అంతర్జాతీయ రేటింగ్ సిస్టమ్‌లకు అనుగుణంగా లేబుల్-రేటెడ్ టైర్‌లను విడుదల చేసింది. కస్టమర్‌లు తమ వాహనాల కోసం టైర్‌లను కొనుగోలు చేసే ముందు ఈ సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడంలో వారికి సహాయపడింది.  Fuel smarrt మరియు Secura Drive శ్రేణి టైర్లు. రోలింగ్ రెసిస్టెన్స్, వెట్ గ్రిప్ మరియు టైర్ నాయిస్ లెవెల్ వంటి ముఖ్యమైన టైర్ పనితీరు సూచికలపై రేటింగ్‌లు ఆధారపడి ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read : DRDO: మానవ రహిత విమానాన్ని పరీక్షించిన డీఆర్‌డీఓ.. ప్రయోగం సక్సెస్