DRDO: మానవ రహిత విమానాన్ని పరీక్షించిన డీఆర్‌డీఓ.. ప్రయోగం సక్సెస్

తాజా పరీక్షలో విమానం నిర్దిష్ట ఎత్తులో ఎగిరిందని, నావిగేషన్, స్మూత్ టచ్ డౌన్ వంటివి కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిందని డీఆర్‌డీఓ ప్రకటనలో పేర్కొంది. మానవ రహిత యుద్ధ విమానాల తయారీలో భాగంగా డీఆర్‌డీఓ దీన్ని రూపొందించింది.

DRDO: మానవ రహిత విమానాన్ని పరీక్షించిన డీఆర్‌డీఓ.. ప్రయోగం సక్సెస్

Drdo

DRDO: భారత రక్షణ, పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ) తయారు చేసిన మానవ రహిత విమాన పరీక్ష విజయవంతమైంది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ ఆధారంగా డీఆర్‌డీఓ ఈ మానవ రహిత విమానాన్ని తయారు చేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిపిన ఈ విమాన పరీక్ష విజయవంతమైనట్లు డీఆర్‌డీఓ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Gold Price: దిగుమతి సుంకం పెంచిన కేంద్రం.. భారీగా పెరిగిన బంగారం ధరలు

తాజా పరీక్షలో విమానం నిర్దిష్ట ఎత్తులో ఎగిరిందని, నావిగేషన్, స్మూత్ టచ్ డౌన్ వంటివి కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిందని డీఆర్‌డీఓ ప్రకటనలో పేర్కొంది. మానవ రహిత యుద్ధ విమానాల తయారీలో భాగంగా డీఆర్‌డీఓ దీన్ని రూపొందించింది. బెంగళూరులోని డీఆర్‌డీఓకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ సంస్థ ఈ విమానాన్ని తయారు చేసింది. సాధారణ విమానాలకు, ఈ విమానానికి అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ విమానంలో చిన్న టర్బో ఫ్యాన్ ఇంజిన్ ఉంటుంది. దీనికోసం వాడిన ఎయిర్ ఫ్రేమ్, అండర్ క్యారేజ్, కంట్రోలింగ్ సిస్టమ్ అంతా స్వదేశీ టెక్నాలజీతోనే తయారైంది. ఈ విమానానికి రెక్కలు ఉన్నప్పటికీ, తోక భాగం ఉండదు. వీటి రెక్కల్లోనే ఆయుధాలు, ఇంధనం కలిగి ఉంటాయి.

PM Modi: నేడు హైదరాబాద్‌కు మోదీ.. మూడు రోజులు ఇక్కడే.. షెడ్యూల్ ఇలా..

ఈ విమానాలను ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కు అందిస్తారు. భవిష్యత్తు యుద్ధాల్లో మానవ రహిత విమానాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకుని డీఆర్‌డీఓ సంస్థ ఈ విమానాల్ని తయారు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అనేక దేశాలు ఈ తరహా విమానాలను రూపొందించుకుంటున్నాయి. భారత్ కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరింది. ఈ విమాన పరీక్ష విజయవంతం కావడంపై డీఆర్‌డీఓను ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.