PM Modi: నేడు హైదరాబాద్‌కు మోదీ.. మూడు రోజులు ఇక్కడే.. షెడ్యూల్ ఇలా..

నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2.55 గంటలకు మోదీ హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సోమవారం ఉధయం వరకు మోదీ ఇక్కడే ఉంటారు.

PM Modi: నేడు హైదరాబాద్‌కు మోదీ.. మూడు రోజులు ఇక్కడే.. షెడ్యూల్ ఇలా..

Pm Modi (3)

PM Modi: నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు మాదాపూర్ లోని హెచ్ఐసీసీ ప్రాంగణం ముస్తాబైంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ సమావేశాలకు రానున్నారు. అదేవిధంగా రేపు సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గోనున్నారు.

PM Modi: 3న బీజేపీ బహిరంగ సభ.. మోదీ ఉండే స్టేజీపై ఏడుగురికే అనుమతి

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మధ్యాహ్నం 2.55 గంటలకు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సోమవారం ఉధయం వరకు మోదీ ఇక్కడే ఉంటారు. శని, ఆది వారాల్లో రాత్రి హైటెక్స్ లోని నోవాటెల్ హోటల్ లో బస చేస్తారు. మోదీ సహా కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల బీజేపీ సీఎంలు, బీజేపీ జాతీయ స్థాయి నేతలు హైదరాబాద్ రానుండటంతో నగరంలో పటిష్ఠ బందోబస్తు ను ఏర్పాటు చేశారు. మోదీ పర్యటించే ప్రాంతాలను ఎస్పీజీ బలగాలు తమ ఆదీనంలోకి తీసుకున్నాయి. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తూ పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.

PM Modi: మోదీ బస చేసేది రాజ్‌భవన్‌లో కాదు.. ఎస్పీజీ సూచనలతో ప్లేస్ మార్చేశారు.. ఎక్కడంటే?

మోదీ పర్యటన వివరాలు ఇలా..
– శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరుతారు.
– మధ్యాహ్న2.55 గంటల సమయంలో హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
– బేగంపేట నుంచి మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో మోదీ బసచేసే నోవాటెల్ హోటల్ కు బయలుదేరుతారు.
– 3.30 గంటలకు హెచ్‌ఐసీసీకి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల వరకు రిజర్వ్‌ సమయంగా ఉంచారు.
– సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
– రాత్రి 9గంటల నుంచి మిగతా సమయమంతా రిజర్వ్ గా ఉంచారు.
– ఆదివారం ఉదయం 10గంటల సమయంలో జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు.
– ఆదివారం సాయంత్రం 4.30 నుంచి 5.40 వరకు రిజర్వ్‌గా ఉంచారు.
– సాయంత్రం 5.55 గంటలకు హైటెక్స్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 6.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
– బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన బహిరంగ సభా ప్రాంగణానికి మోదీ సాయంత్రం 6.30 గంటలకు చేరుకుంటాంరు.
– రాత్రి 7.30 గంటల వరకు సభలో పాల్గొని మోదీ ప్రసంగిస్తారు.
– ఆదివారం రాత్రి 7.35 గంటలకు సభాస్థలి నుంచి బయలుదేరి రాజ్‌భవన్‌ కు లేదా నోవాటెల్ హోటల్‌కు గానీ చేరుకుని బస చేస్తారు.
– సోమవారం ఉదయం 9.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో ఏపీకి బయలుదేరుతారు.
– 10గంటల సమయంలో విజవాడ చేరుకొని ఏపీలోని కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు.