PM Modi: 3న బీజేపీ బహిరంగ సభ.. మోదీ ఉండే స్టేజీపై ఏడుగురికే అనుమతి

జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లోని మాధాపూర్ హెచ్‌ఐసిసిలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల బీజేపీ సీఎంలు, బీజేపీ అగ్రనేతలు పాల్గొనున్నారు. ఇప్పటికే కొందరు కేంద్ర మంత్రులు హైదరాబాద్ కు చేరుకున్నారు.

PM Modi: 3న బీజేపీ బహిరంగ సభ.. మోదీ ఉండే స్టేజీపై ఏడుగురికే అనుమతి

Pm Modi (1)

PM Modi: జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లోని మాధాపూర్ హెచ్‌ఐసిసిలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల బీజేపీ సీఎంలు, బీజేపీ అగ్రనేతలు పాల్గొనున్నారు. ఇప్పటికే కొందరు కేంద్ర మంత్రులు హైదరాబాద్ కు చేరుకున్నారు. 3న సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు పాల్గొంటారు. బహిరంగ సభ ప్రాంగణంలో నాలుగు స్టేజీలను ఏర్పాటు చేస్తున్నారు. మోదీ ఉండే స్టేజీపై ఏడుగురికే అనుమతి ఉంది. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా, రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కు మోదీతో పాటు స్టేజీపై కూర్చునేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

PM Modi : భీమవరంలో భారత్ లోనే భారీ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ

సభా ప్రాంగణంలో మొత్తంలో నాలుగు స్టేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సీఎంలు, కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ, రాష్ట్ర స్థాయి కీలక నేతలు ఇలా ఒక్కో విభాగం వారికి వేరువేరుగా స్టేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సభకు భారీగా ప్రజలను తరలించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది. నియోజకవర్గానికి ఐదు వేల చొప్పున పార్టీ శ్రేణులను సభకు తరలించడం ద్వారా దాదాపు పదిలక్షల మంది సభకు హాజరవుతారని అంచనా బీజేపీ రాష్ట్ర పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కార్యకర్తలను తరలీంచేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు.

PM Modi: మోదీ హైదరాబాద్ పర్యటనకు భారీ భద్రత

ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో సభ జరిగే సమయంలో వర్షం పడినా ఇబ్బందులు తలెత్తకుండా పరేడ్ గ్రౌండ్స్ మొత్తం రూఫ్ తో కవర్ చేస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు జాతీయ కార్యదర్శులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల కోసం ప్రత్యేకంగా ఎంట్రెన్స్ ఏర్పాటు చేశారు. బహిరంగ సభ జరిగే పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే బహిరంగ సభ జరిగే పరేడ్ గ్రౌండ్ తోపాటు, పరిసర ప్రాంతాలను ఎస్పీజీ, ఆర్ఏఎఫ్, లోకల్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తూ, పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.