PM Modi: మోదీ హైదరాబాద్ పర్యటనకు భారీ భద్రత

మోదీతోపాటు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న ముఖ్య నేతలు వస్తుండటంతో నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. మోదీ పర్యటనలో ఉన్నంత వరకు ఆయనకు మూడంచెల భద్రత ఉంటుంది.

PM Modi: మోదీ హైదరాబాద్ పర్యటనకు భారీ భద్రత

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో హైదరాబాద్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా జూలై 2, 3 తేదీల్లో మోదీ హైదారాబాద్‌లోనే ఉంటారు. మోదీతోపాటు ఇతర బీజేపీ నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నగరానికి రానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దాతోపాటు కీలక నేతలు ఈ సమావేశాలకు హాజరవుతారు.

Helicopter Services: లదాఖ్ ప్రాంతంలో అందుబాటులోకి హెలికాప్టర్ సేవలు

మోదీతోపాటు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న ముఖ్య నేతలు వస్తుండటంతో నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. మోదీ పర్యటనలో ఉన్నంత వరకు ఆయనకు మూడంచెల భద్రత ఉంటుంది. నిరంతరం డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తారు. మోదీ సభ జరిగే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌తోపాటు, హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్, రాజ్ భవన్‌ను సైబరాబాద్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వీటి పరిసరాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.

GST: పెరగనున్న హోటల్ రూమ్ ఛార్జీలు.. కొత్త జీఎస్టీ వివరాలు ఇవే

అయితే, మోదీ బస చేయాలనుకుంటున్న రాజ్ భవన్ విషయంలో ప్రధాని భద్రతా వ్యవహారాలు చూసే ఎస్పీజీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాజ్ భవన్‌లో బస చేస్తే భద్రత పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని తెలంగాణ ఇంటెలిజెన్స్ భావిస్తోంది. అందుకే ఈ విషయంలో అధికారులు ఆలోచిస్తున్నారు. దీనిపై రాష్ట్ర పోలీసు అధికారులు ఎస్పీజీకి సమాచారం అందించారు. ఈ విషయంలో పునరాలోచించాలని కోరారు.