GST: పెరగనున్న హోటల్ రూమ్ ఛార్జీలు.. కొత్త జీఎస్టీ వివరాలు ఇవే

తాజాగా నిర్ణయించిన జీఎస్టీ పరిధి వివరాల ప్రకారం.. చేపలు, పెరుగు, తేనె, పనీర్, మఖానా, గోధుమ, ఇతర తృణధాన్యాలు, గోధుమ పిండి, ప్యాక్డ్ లేదా లేబుల్డ్ మీట్, బెల్లం, మరమరాలు వంటివి జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. వీటిపై ఐదు శాతం జీఎస్టీ విధించే అవకాశం ఉంది.

GST: పెరగనున్న హోటల్ రూమ్ ఛార్జీలు.. కొత్త జీఎస్టీ వివరాలు ఇవే

GST: కొత్తగా మరికొన్ని ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంగళవారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రుల సూచనలు, సలహాల ఆధారంగా మరికొన్ని ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు.

Rajya Sabha: పెద్దల సభలో నేరస్తులు..!

తాజాగా నిర్ణయించిన జీఎస్టీ పరిధి వివరాల ప్రకారం.. చేపలు, పెరుగు, తేనె, పనీర్, మఖానా, గోధుమ, ఇతర తృణధాన్యాలు, గోధుమ పిండి, ప్యాక్డ్ లేదా లేబుల్డ్ మీట్, బెల్లం, మరమరాలు వంటివి జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. వీటిపై ఐదు శాతం జీఎస్టీ విధించే అవకాశం ఉంది. ప్రధానంగా ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ ఈసారి ఎక్కువగా జీఎస్టీ పరిధిలోకి తేనున్నారు. ఇప్పటివరకు జీఎస్టీ పరిధిలో లేని అనేక ఉత్పత్తుల్ని ఈ సారి జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తున్నారు.  బ్యాంకులు జారీ చేసే చెక్కు బుక్కులపై కూడా 18 శాతం జీఎస్టీ ఉంటుంది.

AB Venkateshwar Rao: మరోసారి ఏబీవీని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం

హోటల్ రూమ్ ఛార్జీల భారం కూడా పెరగనుంది. దీనికి కారణం వెయ్యి రూపాయలలోపు ఛార్జిపై 12 శాతం జీఎస్టీ విధిస్తారు. మ్యాప్స్, చార్ట్స్, అట్లాస్ వంటి వాటిపై 12 శాతం జీఎస్టీ విధిస్తారు. మరోవైపు ఎడిబుల్ ఆయిల్, బొగ్గు, ఎల్ఈడీ బల్బులు, ప్రింటింగ్/డ్రాయింగ్ ఇంక్, లెదర్ ఉత్పత్తులు, సోలార్ వాటర్ హీటర్ వంటి ఉత్పత్తులపై విధించే జీఎస్టీని మార్చబోతున్నారు. బుధవారం జరిగే సమావేశంలో వీటిపై తుది నిర్ణయం తీసుకుంటారు.