AB Venkateshwar Rao: మరోసారి ఏబీవీని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం

గతంలోనే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏబీవీ సస్పెండ్ అయ్యారు. ఆయనపై నిఘా విభాగం అధిపతిగా పనిచేసిన సమయంలో కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్నఅభియోగాలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

AB Venkateshwar Rao: మరోసారి ఏబీవీని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం

Ab Venkateshwar Rao

AB Venkateshwar Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఐబీ వెంకటేశ్వర రావును ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెండ్ చేసింది. క్రమశిక్షణా రహితంగా వ్యవహరించి, ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు గాను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎస్ సమీర్ శర్మ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1969 ఆల్ ఇండియా సర్వీస్ రూల్ 3, సబ్ రూల్ 3 ప్రకారం సస్పెన్షన్ చేసినట్లు వెల్లడించారు.

Udaipur incident: ఊహ‌కు అంద‌ని ఘ‌ట‌న జ‌రిగింది.. మోదీ, షా స్పందించాలి: రాజ‌స్థాన్ సీఎం

గతంలోనే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏబీవీ సస్పెండ్ అయ్యారు. ఆయనపై నిఘా విభాగం అధిపతిగా పనిచేసిన సమయంలో కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్నఅభియోగాలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వర రావును, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 మే 30న బదిలీ చేసింది. కానీ, పోస్టింగు ఇవ్వలేదు. తర్వాత 2020 ఫిబ్రవరి 8న ఆయనను సస్పెండ్ చేసింది. తన సస్పెన్షన్ అక్రమం అంటూ ఆయన కోర్టుకు వెళ్లారు. చివరకు సుప్రీంకోర్టు ఆయనకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఆయనకు ఏపీ ప్రభుత్వం ఇటీవలే తిరిగి పోస్టింగ్ ఇచ్చింది. ఈ నెల 14న ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది. పదవీ బాధ్యతలు చేపట్టిన రెండు వారాల్లోనే ప్రభుత్వం తిరిగి సస్పెండ్ చేసింది.

Nikki Tamboli : కోటి రూపాయల కారు కొన్న హీరోయిన్

కొన్ని నెలల క్రితం తన సస్పెన్షన్‌పై మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపైనే ప్రభుత్వం తాజాగా సస్పెండ్ చేసింది. సర్వీస్ రూల్స్‌లోని ఆరవ నిబంధన ప్రకారం అనుమతి లేకుండా, వెంకటేశ్వర రావు మీడియా సమావేశం నిర్వహించారని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మీడియా సమావేశం తప్పని మెమోలో పేర్కొన్నారు. నోటీసు అందిన వారంలోపు తగిన వివరణ ఇవ్వకపోతే, తదుపరి చర్యలు ఉంటాయని నోటీసులో పేర్కొన్నారు.