PM Modi: మోదీ బస చేసేది రాజ్‌భవన్‌లో కాదు.. ఎస్పీజీ సూచనలతో ప్లేస్ మార్చేశారు.. ఎక్కడంటే?

జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీతో పాటు పెద్ద సంఖ్యలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు రానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మొత్తం కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.

PM Modi: మోదీ బస చేసేది రాజ్‌భవన్‌లో కాదు.. ఎస్పీజీ సూచనలతో ప్లేస్ మార్చేశారు.. ఎక్కడంటే?
ad

PM Modi: జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీతో పాటు పెద్ద సంఖ్యలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు రానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మొత్తం కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లోనే బస చేయనున్నారు. తొలుత రాజ్ భవన్ లో ప్రధాని నరేంద్ర మోదీ బస ఏర్పాట్లు చేశారు.

PM Modi-Amit Shah: టార్గెట్ తెలంగాణ.. ఆ మూడు రోజులు మోదీ, అమిత్ షా హైదరాబాద్‌లోనే..

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ బస చేసే ప్లేస్ మారిపోయింది. మోదీ రాకకు ముందుగానే (బుధవారం) ఎస్పీజీ( స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) బృందాలు హైదరాబాద్ కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. తొలుత రాజ్ భవన్ లోనే ప్రధాని నరేంద్ర మోదీ బస చేస్తారని నిర్ణయించినప్పటికీ.. పలు కారణాల వల్ల నోవాటెల్ హోటల్లో ప్రధాని బస ఉంటుందని తెలిపారు.

KA Paul: ప్రధానిగా మోదీ ఉండకూడదు.. వారిద్దరిలో ఎవరైనా ఓకే..

రాజ్ భవన్ నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే ప్రాంతానికి దూరం ఉంటుందని, సుమారు 14 కి.మీ దూరం ఉండటంతో రాజ్ భవన్ నుంచి హెచ్ ఐసీసీ వరకు ప్రధాని రాకపోకలు , భద్రతా ఏర్పాట్లు విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. దీంతో ఎస్పీజీ సూచన మేరకు ప్రధాని బస ఏర్పాట్లు నోవాటెల్ లో చేశారు. ఇదిలాఉంటే నోవాటెల్ హోటల్ లో బసచేస్తారు. ఈ హోటల్ లో మొత్తం 288 గదులున్నాయని, ప్రధాని బస కోసం ఓ ఫ్లోర్ మొత్తం రిజర్వు చేశారని, బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఈ హోటల్ మొత్తాన్ని బుక్ చేశారని హోటల్ ప్రతినిధి ఒకరు తెలిపారు.