PM Modi-Amit Shah: టార్గెట్ తెలంగాణ.. ఆ మూడు రోజులు మోదీ, అమిత్ షా హైదరాబాద్‌లోనే..

తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఎన్నికల సమయం నాటికి అధికార తెరాస పార్టీకి దీటుగా తెలంగాణలో బలోపేతం అయ్యేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే అమిత్ షా, మోదీలు రాష్ట్రంలో పర్యటించారు.

PM Modi-Amit Shah: టార్గెట్ తెలంగాణ.. ఆ మూడు రోజులు మోదీ, అమిత్ షా హైదరాబాద్‌లోనే..

Pm Modi (2)

PM Modi-Amit Shah: తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఎన్నికల సమయం నాటికి అధికార తెరాస పార్టీకి దీటుగా తెలంగాణలో బలోపేతం అయ్యేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే అమిత్ షా, మోదీలు రాష్ట్రంలో పర్యటించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రతో పాటు మోదీ, అమిత్ షాలు రాష్ట్రంలో పర్యటించడంతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వ్యక్తమవుతుంది. కాగా త్వరలోనే మరోసారి మోదీ, అమిత్ షాలు తెలంగాణకు రానున్నారు. ఇక్కడే మూడు రోజుల పాటు ఉంటారని తెలుస్తోంది.

BJP: మోదీ సభకు పోలీసుల ఆటంకాలు.. బీజేపీ నేతల ఆగ్రహం

త్వరలో నిర్వహించనున్న భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కాబోతున్నట్లు సమాచారం. నగరంలోని హెచ్ఐసీసీలోని నోవాటెల్ హోటల్ లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి బీఎల్ సంతోష్ హైదరాబాద్ వచ్చినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో పాటుగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యే అవకాశం ఉంది. సుమారు 300 మంది ప్రముఖులు ఉండేలా నోవాటెల్ వద్ద బస ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ మూడు రోజులు మోదీ, అమిత్ షాలు నోవాటెల్ లోనే బస చేయనున్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు తెలంగాణ రాష్ట్రంను వ్యూహాత్మకంగానే ఎంపిక చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం

దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా ప్రాబల్యం చూపలేక పోతున్న బీజేపీ ఈ దఫా తెలంగాణ రాష్ట్రంను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు సీఎం కేసీఆర్ బీజేపీ, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ కూటమి అంటూ జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా కార్పొరేటర్లను గెలుచుకున్న బీజేపీ అప్పటి నుంచి తెలంగాణలో రోజురోజుకు బలం పెంచుకుంటుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు గెలుపుతో మరింత ఉత్సాహంగా ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. బండి సంజయ్ పాదయాత్రలు, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వ్యూహాలతో రాష్ట్రంలో బీజేపీ చాపకింద నీరులా బలోపేతం అవుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ గెలుపునకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు బీజేపీ కేంద్ర పార్టీ భావిస్తుంది. ఇందులో భాగంగానే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.