Nothing Phone (1) : ఛార్జర్ లేకుండానే నథింగ్ ఫోన్ (1).. ఇదిగో లీక్ వీడియో..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు లండన్ ఆధారిత కంపెనీ నుంచి సరికొత్త నథింగ్ ఫోన్ (1) మార్కెట్లోకి వస్తోంది. జూలై 12న మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.

Nothing Phone (1) : ఛార్జర్ లేకుండానే నథింగ్ ఫోన్ (1).. ఇదిగో లీక్ వీడియో..!

Nothing Phone (1) May Not Come With A Charger, Leaked Video Of Retail Box Reveals

Nothing Phone (1) : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు లండన్ ఆధారిత కంపెనీ నుంచి సరికొత్త నథింగ్ ఫోన్ (1) మార్కెట్లోకి వస్తోంది. జూలై 12న మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. అయితే సరికొత్త టెక్నాలజీతో రానున్న ఈ నథింగ్ ఫోన్ (1)తో ఛార్జర్ రాదట.. దీనికి సంబంధించి రిటైల్ బాక్స్ లీక్ వీడియో ద్వారా తెలిసింది. నథింగ్ ఫోన్ (1) అనేది సరికొత్త సాంకేతికత. చక్కటి డిజైన్‌తో, నథింగ్ ఫోన్ (1) చాలా కొత్తదనాన్ని అందించనుంది. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో లైటింగ్ స్ట్రిప్స్‌ను కలిగి ఉంది. ఇప్పటివరకు ఏ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇలా ప్రయత్నించలేదు. స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌ల గురించి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. కానీ, కంపెనీ ఛార్జర్‌లో బాక్సులో ఉండకపోవచ్చునని కొత్త నివేదిక తెలిపింది.

Nothing Phone (1) May Not Come With A Charger, Leaked Video Of Retail Box Reveals (1)

Nothing Phone (1) May Not Come With A Charger, Leaked Video Of Retail Box Reveals

గతంలో.. నథింగ్ ఫోన్ (1) 33W ఛార్జర్‌కు సపోర్టు ఇస్తుందని లీక్‌లు సూచించాయి. నథింగ్ ఫోన్ (1) రిటైల్ బాక్స్‌తో కొత్త వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో బాక్స్ స్లిమ్‌గా కనిపిస్తోంది. అన్నింటికంటే బాక్సులో ఛార్జర్‌ రాదని నివేదిక సూచిస్తుంది. నథింగ్ ఫోన్ (1) 33W ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్టు ఇస్తుందని లీక్‌ వీడియో ద్వారా తెలుస్తోంది. కంపెనీ ఫోన్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసిన తర్వాత మాత్రమే అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలుస్తుంది. అధికారిక లాంచ్ ముందు ఇలాంటి లీకులు సాధారణమే.. ప్రస్తుతానికి, డివైజ్ ధర అంచనా, ఏయే స్పెసిఫికేషన్‌లతో రానుందో ఓసారి చూద్దాం.

Nothing Phone (1) May Not Come With A Charger, Leaked Video Of Retail Box Reveals

నథింగ్ ఫోన్ (1) ధర (అంచనా) :
నథింగ్ ఫోన్ ధర గురించి ఎలాంటి సమాచారం లేదు. రూమర్ మిల్ షట్‌డౌన్ చేసేందుకు నిరాకరించింది. నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్‌లలో $400 (దాదాపు రూ. 31,600) కన్నాతక్కువ ధరకు రాదు. 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో నథింగ్ ఫోన్ (1) బేస్ వేరియంట్ ధర $397 (దాదాపు రూ. 31,400). 8GB + 256GB, 12GB + 256GB స్టోరేజీ ఆప్షన్ ధర $419 (దాదాపు రూ. 33,100), $456 (దాదాపు రూ. 36,000). భారత్ దేశంలో ధర రూ. 30వేల లోపు ఉంటుంది.

నథింగ్ ఫోన్ (1): స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ (1) సెల్ఫీ కెమెరాతో వస్తోంది. ఫ్రంట్ సైడ్ పంచ్-హోల్ కటౌట్‌తో 6.55-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో రానుంది. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778+ 5G చిప్‌సెట్ ద్వారా 12GB వరకు LPDDR5 RAM, 256GB UFS 3.1 స్టోరేజ్‌తో రానుంది. ఈ ఫోన్ నథింగ్ OS కస్టమ్ స్కిన్‌తో బాక్స్ Android 12 రన్ అయ్యే అవకాశం ఉంది. ఆప్టిక్స్ పరంగా చూస్తే.. నథింగ్ ఫోన్ (1) వెనుక భాగంలో డ్యూయల్-కెమెరా సెటప్‌తో రానుంది. 50MP ప్రైమరీ సెన్సార్, 16MP సెకండరీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి.

ఫ్రంట్ సైడ్ స్మార్ట్‌ఫోన్ సెల్ఫీల కోసం 16-MP కెమెరాతో రానుందని భావిస్తున్నారు. నథింగ్ ఫోన్ (1) 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,500mAh బ్యాటరీతో రానుందని భావిస్తున్నారు. ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుందని భావిస్తున్నారు. డాల్బీ అట్మోస్, స్టీరియో స్పీకర్లకు సపోర్టు ఇస్తుందని అంచనా. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.1, GPS, NFC సపోర్టు కూడా ఉండే అవకాశం ఉంది.

Read Also : Infinix Note 12 Series : రూ.15వేల లోపు ధరకే Infinix 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్..!