Oppo Reno 7 Series : ఒప్పో రెనో 7 సిరీస్ ఫుల్ ఫీచ‌ర్లు లీక్.. ధర ఎంతంటే?

ఒప్పో నుంచి రెనో 7 సిరీస్ (Reno 7 Series) ఫోన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు లీకయ్యాయి. Oppo Reno 7 ఫోన్ లాంచింగ్ ముందే పూర్తి ఫీచర్లు లీకైనట్టు ఓ రిపోర్టు వెల్లడించింది.

Oppo Reno 7 Series : ఒప్పో రెనో 7 సిరీస్ ఫుల్ ఫీచ‌ర్లు లీక్.. ధర ఎంతంటే?

Oppo Reno 7, Reno 7 Pro Leak Reveals Their Full Specifications, Reno 7 Se Also Tipped

Oppo Reno Series : ప్రముఖ చెైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి రెనో 7 సిరీస్ (Reno 7 Series) ఫోన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు లీకయ్యాయి. Oppo Reno 7 ఫోన్ లాంచింగ్ ముందే పూర్తి ఫీచర్లు లీకైనట్టు ఓ రిపోర్టు వెల్లడించింది. రానున్న ఒప్పో కెమెరా-ఫోక‌స్డ్ ఫోన్ సిరీస్‌లో Reno 7, Reno 7pro, Reno 7 SE ఫీచర్ల వివరాలను స్పానిష్ వెబ్ సైట్లో లీకయ్యాయి. Reno 7 Pro+ ఉండకపోవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ మోడల్ స్థానంలో Reno 7 SE ఉండవచ్చని నివేదిక చెబుతోంది. Oppo రాబోయే కెమెరా-ఫోకస్డ్ ఫోన్ సిరీస్‌లో Reno 7, Reno 7 Pro Reno 7 SEలను లాంచ్ చేసే అవకాశం ఉంది. Oppo Reno 7, Reno 7 Pro ఫోన్లు Full HD రిజల్యూషన్ డిస్‌ప్లే సైజు 6.5 అంగుళాలు ఉండొచ్చునని స్పానిష్ వెబ్‌సైట్ తెలిపింది. అందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటాయి.

Reno 4 సిరీస్ నుంచి 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. అయితే రెండు ఫోన్‌లు 4500mAh బ్యాటరీతో రానున్నాయి. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. రెండు రెనో 7 ఫోన్‌లు Android 11-ఆధారిత ColorOS 11 రన్ అవుతున్నాయి. Reno 7 మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌ కలిగి ఉండగా.. రెనో 7 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ పై పనిచేస్తుందని నివేదిక పేర్కొంది. Reno 7pro లోపల స్నాప్‌డ్రాగన్ 778 ప్రాసెసర్ ఉండవచ్చని నివేదికలు తెలిపాయి. Reno 7pro సిరీస్‌ మోస్ట్ పవర్‌ఫుల్ మోడల్‌గా చెప్పవచ్చు. ఒప్పో రెనో.. రెండు ఫోన్‌లలో కెమెరా ఫీచర్లు వేర్వేరుగా ఉంటాయి. Oppo Reno 7 50-MP Sony IMX766 ప్రధాన సెన్సార్‌తో 16-MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2-MP కెమెరాతో డెప్త్ సెన్సింగ్ ఉండవచ్చు. Reno 7pro ఫోన్‌లో 50-MP Samsung GN5 సెన్సార్‌ను కలిగి ఉండొచ్చు. 64-MP OmniVision OV64B అల్ట్రా-వైడ్ సెన్సార్, 13-MP టెలిఫోటో కెమెరా కలిగి ఉంది.
Google Chrome Warn : క్రోమ్‌ యూజర్లకు గూగుల్ వార్నింగ్.. వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోండి!

రెండు Reno 7 ఫోన్‌లు Oppo ఫ్లాగ్ షిప్ లైనప్‌లో రానున్నాయి. కానీ, కొత్త Reno 7 SE సరసమైన ధరకే ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. లాంచింగ్ ముందే ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. 90Hz రిఫ్రెష్ రేట్‌తో చిన్న 6.43-అంగుళాల Full-HD+ డిస్‌ప్లే, డైమెన్సిటీ 920 చిప్‌సెట్, ట్రిపుల్-కెమెరా సెటప్ (64-MP ఓమ్నివిజన్ OV64B ప్రైమరీ కెమెరా, 8-MP సోనీ ulIMtrax35 వైడ్ షూటర్ పోర్ట్రెయిట్ ఫోటోల కోసం 2-MP డెప్త్-సెన్సింగ్ కెమెరా), 32-MP సెల్ఫీ కెమెరా 65W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 4300mAh బ్యాటరీని అందిస్తోంది. Weibo టిప్‌స్టర్ నుంచి ఈ ఒప్పో రెనో మూడు మోడళ్ల ప్రత్యేక లీక్ ధరలను కూడా వెల్లడించింది. Reno 7 CNY 3,499 (దాదాపు రూ. 40,900) నుంచి ప్రారంభం కావచ్చు. Reno 7pro ఎంట్రీ మోడల్ ధర CNY 4,299 (దాదాపు రూ. 50,300)గా ఉండనుంది. Reno 7 SE CNY 2,699 ప్రారంభ ధర (దాదాపు రూ. 31,600) నుంచి అందుబాటులో ఉండొచ్చు. నవంబర్ లేదా డిసెంబర్ చివరిలో Reno 7 సిరీస్‌ సేల్స్‌ను Oppo ప్రారంభించనుంది.
Read Also :  Petrol Price : స్థిరంగా పెట్రోల్ ధరలు, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 114