Petrol Price : స్థిరంగా పెట్రోల్ ధరలు, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 114

చమురు ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోల్ బంక్ కు వెళ్లాలంటే...భయపడిపోతున్నారు. దేశంలో రికార్డు స్థాయిలో ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

Petrol Price : స్థిరంగా పెట్రోల్ ధరలు, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 114

Petrol Rate

Petrol Price In India : చమురు ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోల్ బంక్ కు వెళ్లాలంటే…భయపడిపోతున్నారు. దేశంలో రికార్డు స్థాయిలో ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. ఓ వైపు కరోనాతో అల్లాడుతుంటే..పెరిగిన ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది.  అంతర్జాతీయంగా చమురు ధరలను బట్టి..దేశీయంగా పెంపు ఉంటోందంటున్నాయి కంపెనీలు.

Read More : Google Chrome Warn : క్రోమ్‌ యూజర్లకు గూగుల్ వార్నింగ్.. వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోండి!

నిత్యావసర సరుకుల ధరలు కూడా పెంచేస్తున్నారు. మే నెల నుంచి ఈ ధరల బాదుడు షురూ అయ్యింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.114.50 డీజిల్ రూ.107.40గా ఉండగా…దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.110.04 డీజిల్ రూ.98.42గా ఉంది. ముంబయిలో లో లీటర్ పెట్రోల్ రూ.115.85 డీజిల్ రూ.106.62, కోల్ కతాలో లీటర్ పెట్రోల్ రూ.110.49 డీజిల్ రూ.101.56 కొనసాగుతున్నాయి. చెన్నై లో లీటర్ పెట్రోల్ రూ.106.66, డీజిల్ రూ.102.59 ఉంది.

Read More : Kranti Redkar Wankhede : మధ్యాహ్న భోజనం ఖర్చు ఇదే…వాంఖడే సతీమణి ట్వీట్

వివిధ నగరాల్లో ధరలు

– ఢిల్లీలో పెట్రోల్‌ రూ.110.04.. డీజిల్‌ రూ.98.42
– చెన్నైలో పెట్రోల్‌ రూ.106.66.. డీజిల్‌ రూ.102.59
– గుర్ గావ్ లో పెట్రోల్‌ రూ.107.61.. డీజిల్‌ రూ.99.22
– నోయిడాలో పెట్రోల్‌ రూ.107.20.. డీజిల్‌ రూ.99.12

Read More : Facial Recognition : ఫేస్ ప్రింటర్లను తొలగించనున్న ఫేస్ బుక్

– బెంగళూరులో పెట్రోల్‌ రూ.113.93.. డీజిల్‌ రూ.104.50
– భువనేశ్వర్ పెట్రోల్‌ రూ.111.06.. డీజిల్‌ రూ.107.39
–  చండీఘడ్ పెట్రోల్‌ రూ.105.94.. డీజిల్‌ రూ.98.16

Read More : Khel Ratna : ఖేల్ రత్నాలు వీరే..12 మంది క్రీడాకారులు

– హైదరాబాద్ లో పెట్రోల్‌ రూ.114.49.. డీజిల్‌ రూ.107.40
– జైపూర్ లో పెట్రోల్‌ రూ.117.45.. డీజిల్‌ రూ 108.39
– విజయవాడలో రూ.116.61 డీజిల్‌ రూ.108.89