Kranti Redkar Wankhede : మధ్యాహ్న భోజనం ఖర్చు ఇదే…వాంఖడే సతీమణి ట్వీట్

స‌మీర్ వాంఖ‌డేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలకు వాంఖడే సతీమణి క్రాంతి రేడ్కర్ ధీటుగా సమాధానమిచ్చారు.

Kranti Redkar Wankhede : మధ్యాహ్న భోజనం ఖర్చు ఇదే…వాంఖడే సతీమణి ట్వీట్

Kranthi

Dal Makhni And Jeera Rice : బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోన‌ల్ డైర‌క్ట‌ర్ స‌మీర్ వాంఖ‌డేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలకు వాంఖడే సతీమణి క్రాంతి రేడ్కర్ ధీటుగా సమాధానమిచ్చారు. తాము తినే తిండే గురించి..ఎవరూ వ్యాఖ్యలు చేయకుండా…ఆధారాలతో సహా ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More : TS EAMCET : ఆరు నుంచి ఎంసెట్‌ రెండో విడత

మధ్యాహ్న భోజన విషయంలో ఆమె పలు విషయాలను వెల్లడించారు. తాము మధ్యాహ్న భోజనంలో దాల్ మఖ్నీ, జీరా రైస్       తీసుకున్నామని, రైస్ మాత్రం ఇంట్లో తయారు చేసిందేనని చెప్పుకొచ్చారు. దాల మఖ్నీ మాత్రం బయటి నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నామన్నారు. దీనికి సంబంధించిన విషయాన్ని క్రాంతి రేడ్కర్ స్వయంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దాల్ మఖ్నీ రేటు రూ. 190 అని తెలిపారు. ఒక ప్రభుత్వ అధికారికి సాధ్యం కాని రీతిలో మేం ఆహారానికి ఖర్చు చేస్తున్నామని అనొచ్చని, అందుకే ఆధారాలతో సహా…వెల్లడిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా క్రాంతి వ్యగ్యంగా స్పందించారు.

Read More : Facial Recognition : ఫేస్ ప్రింటర్లను తొలగించనున్న ఫేస్ బుక్

డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టు దగ్గరి నుంచి…పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో…కీలకంగా వ్యవహరిస్తున్న అధికారి వాంఖడేపై మంత్రి మాలిక్ విమర్శలు గుప్పిస్తున్నారు. తప్పుడు కేసులు బనాయించి.. అధికారి కోట్లకు పడగలెత్తాడని, రూ. 70 వేల విలువైన అంగీ, రూ. లక్ష విలువైన ట్రౌజర్, లక్షల విలువ చేసే…చేతి గడియారాలు ధరిస్తున్నాడంటూ…వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ జస్ట్ పుకార్లేనంటూ..సమీర్ కొట్టిపారేశారు. ఈ క్రమంలో…క్రాంతి వ్యంగ్యంగా స్పందిస్తూ..చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.