Airfares Decline: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పది డొమెస్టిక్ మార్గాల్లో విమాన చార్జీలు తగ్గుముఖం

దేశంలోని డొమెస్టిక్ విమాన ప్రయాణికులకు పౌర విమానయాన మంత్రిత్వశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పెరిగిన విమాన ప్రయాణ చార్జీలను తాజాగా తగ్గించింది.....

Airfares Decline: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పది డొమెస్టిక్ మార్గాల్లో విమాన చార్జీలు తగ్గుముఖం

Airfares Decline

Updated On : June 14, 2023 / 5:05 AM IST

Airfares Decline On 10 Domestic Routes: దేశంలోని డొమెస్టిక్ విమాన ప్రయాణికులకు పౌర విమానయాన మంత్రిత్వశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పెరిగిన విమాన ప్రయాణ చార్జీలను తాజాగా తగ్గించింది. దేశంలోని డొమెస్టిక్ విమాన ప్రయాణికులకు శుభవార్త. గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ సంక్షోభంలో చిక్కుకోవడంతో దేశంలో విమాన ప్రయాణ చార్జీలకు రెక్కలు వచ్చాయి.పెరిగిన విమాన చార్జీలతో ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ విమాన టికెట్ల ధరలు తగ్గించాలని విమాన యాన సంస్థలను కోరింది.(Airfares Decline) దీంతో దేశంలోని పది దేశీయ మార్గాల్లో(10 Domestic Routes) విమాన ప్రయాణ చార్జీలు తగ్గాయి. ఢిల్లీ-శ్రీనగర్‌తో సహా పది దేశీయ రూట్లలో మొత్తం సగటు విమాన ఛార్జీలు తగ్గుముఖం పట్టాయి.

Nigeria Boat Capsizes: నైజీరియా నదిలో పడవ బోల్తా..103 మంది మృతి

రాబోయే రోజుల్లో కూడా ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ తెలిపింది. ఢిల్లీ-శ్రీనగర్, శ్రీనగర్-ఢిల్లీ, ఢిల్లీ-లేహ్, లేహ్-ఢిల్లీ, ముంబై-ఢిల్లీ, ఢిల్లీ-ముంబయి, ఢిల్లీ-పూణె, పూణె-ఢిల్లీ, అహ్మదాబాద్-ఢిల్లీ, ఢిల్లీ-అహ్మదాబాద్ పది మార్గాల్లో సగటు విమాన ఛార్జీలు తగ్గుముఖం పట్టాయని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. మే 3వతేదీ నుంచి గో ఫస్ట్ విమానాలు నడపక పోవడంతో పలు మార్గాల్లో విమాన ఛార్జీలు పెరిగాయి.

భారీగా తగ్గిన ఐఫోన్ 14 సిరీస్‌ ధర..!

జూన్ 5నవతేదీన పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో విమానయాన సంస్థ లు ఛార్జీలను స్వీయ-నియంత్రణ చేయాలని కోరారు. విమాన టిక్కెట్ల సహేతుకమైన ధరను నిర్ధారించడానికి ఒక యంత్రాంగాన్ని కూడా నియమించారు.విమాన చార్జీలు 60 శాతం వరకు తగ్గాయని,ఛార్జీలు పెరిగిన కొన్ని రూట్లలో మరింత తగ్గే అవకాశం ఉందని కేంద్ర మంత్రి సింధియా చెప్పారు.