Petrol at Rs 200: ఆ రాష్ట్రంలో పెట్రోల్ లీటర్ ధర రూ.200..ఎందుకంటే…

Petrol at Rs 200: ఆ రాష్ట్రంలో పెట్రోల్ లీటర్ ధర రూ.200..ఎందుకంటే…

Long queues in front of petrol pump in Imphal

Petrol at Rs 200: హింసాకాండ చెలరేగిన మణిపూర్ రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తమైంది.మణిపూర్‌లో మెయిటీ,కుకీ వర్గాల మధ్య హింస నెల రోజులుగా కొనసాగింది. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి.(violence hit Manipur) పెట్రోలు లీటరు ధర బ్లాక్ మార్కెట్ లో 200 రూపాయలకు పెరిగింది.(Petrol at Rs 200) పెట్రోల్ బంకుల వద్ద జనం బారులు తీరారు.ఔషధాల తీవ్ర కొరతతో పాటు ఏటీఎంలలో నగదు నిల్వలు లేకపోవడం(cash less ATMs) మణిపూర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Odisha Train Accident : ఒడిషా రైలు ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత రైల్వే ట్రాక్ పునరుద్ధరణ..ట్రాక్‌పై వెళ్లిన మొదటి రైలు

హైవే దిగ్బంధనం కారణంగా ఇంఫాల్ లోయలో దైనందిన జన జీవనం స్తంభించి పోయింది. నెల రోజుల హింసాకాండలో మరణించిన వారి సంఖ్య 98కాగా, మరో 310 మంది గాయపడ్డారు. మణిపూర్‌లో ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన ప్రజలు ఢిల్లీ, దిమాపూర్, గౌహతిలలోని సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందారు.నెల రోజులుగా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే ప్రపంచంతో మణిపూర్ తెగతెంపులు చేసుకుంది.

గతంలో కిలో బియ్యం సగటు ధర రూ.30 నుంచి రూ.60కి చేరింది. కూరగాయల ధరలపైనా ప్రభావం పడింది. గతంలో కిలో రూ.35 ఉన్న ఉల్లిపాయలు ఇప్పుడు రూ.70, బంగాళదుంపల ధర రూ.15 నుంచి రూ.40కి పెరిగింది. గుడ్లు రూ.6 నుంచి రూ.10కి.. రిఫైన్డ్ ఆయిల్ ధర కూడా పెరిగింది.ఆయిల్ మునుపటి ధర రూ. 220 నుంచి దాదాపు రూ. 250 నుండి 280 వరకు పెరిగింది.మణిపురీలు లీటర్ పెట్రోల్‌కు బ్లాక్ మార్కెట్‌లో రూ.200 చెల్లిస్తున్నారు.హింసతో బాధపడుతున్న రాష్ట్రంలో సరుకుల కొరత ప్రజలను మరింత దెబ్బతీసింది.ఏటీఎంలలో నగదు అయిపోవడం, బ్యాంకులు మూతపడడం, ఇంటర్నెట్ లేకపోవడంతో కొనుగోలుదారులు నానా అవస్థలు పడుతున్నారు.