Jio True 5G in Telangana : తెలంగాణలో మరో 8 నగరాల్లో జియో ట్రూ 5G సర్వీసులు.. 1Gbps అన్‌లిమిటెడ్ డేటా, జియో వెల్‌కమ్ ఆఫర్ పొందాలంటే?
Jio True 5G in Telangana : తెలంగాణలో రిలయన్స్ జియో (Reliance Jio) 5G కస్టమర్లకు గుడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా జియో 5G సర్వీసులను క్రమంగా విస్తరిస్తోంది.

Reliance Jio True 5G Services In 8 New Cities Of Telangana _ How to get Jio 5G Welcome Offer, Full Details
Jio True 5G in Telangana : తెలంగాణలో రిలయన్స్ జియో (Reliance Jio) 5G కస్టమర్లకు గుడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా జియో 5G సర్వీసులను క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన జియో ట్రూ 5G సర్వీసులు (Jio True 5G Services) కొత్తగా మరో 8 నగరాల్లోకి అందుబాటులోకి వచ్చేశాయి. జియో 5G సర్వీసుల ద్వారా 1Gbps+ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. అంతకంటే ముందు జియో యూజర్లు ‘Jio Welcome Offer ’ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాతే జియో ట్రూ 5G సర్వీసులను యాక్సస్ చేసుకోవచ్చు. అయితే, రిలయన్స్ జియో (Reliance Jio) తన ట్రూ 5G సర్వీసులను తెలంగాణలో మరో 8 నగరాల్లో మంగళవారం లాంఛనంగా ప్రారంభించింది.
కొత్తగా జియో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చిన నగరాల్లో సిద్ధిపేట, సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, కోదాడ, తాండూర్, జహీరాబాద్, నిర్మల్ నగరాల్లో యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణవ్యాప్తంగా, ఇప్పటికే 10 నగరాల్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, రామగుండం, మంచిర్యాలలో రిలయన్స్ జియో True 5G సర్వీసులను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కొత్తగా ప్రారంభించిన 8 నగరాలతో కలిపి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 నగరాల్లో జియో యూజర్లు 5G సర్వీసులను పొందవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణలోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5G సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Reliance Jio True 5G Services In 8 New Cities Of Telangana
జియో ట్రూ 5G యూజర్లు రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలతో రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ సందర్భంగా జియో తెలంగాణ సీఈఓ KC రెడ్డి మాట్లాడుతూ ‘తెలంగాణలో జియో ట్రూ 5జీని మరో 8 నగరాలకు విస్తరించడం చాలా సంతోషంగా ఉంది. జియో ట్రూ 5జీ నెట్‌వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుంది. జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికి ట్రూ -5G బెనిఫిట్స్ అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నారు. తెలంగాణను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’ అని అన్నారు.
మార్చి 8 నుంచే జియో వెల్‌కమ్ ఆఫర్ ఇన్విటేషన్ :
మార్చి 8 నుంచి రాష్ట్రంలోని 8 నగరాల్లో జియో యూజర్లకు (Jio Welcome Offer) పొందవచ్చు. దీనిద్వారా అదనపు ఖర్చు లేకుండా 1Gbps + స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్,
జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 4G LTE టెక్నాలజీతో ప్రపంచస్థాయి ఆల్-ఐపీ (ALL-IP) డేటా స్ట్రాంగ్ ఫ్యూచర్ ప్రూఫ్ నెట్ వర్క్‌ను నిర్మించింది. దేశీయ 5G స్టాక్ లేకుండానే ఇప్పుడు 5G నెట్‌వర్క్ రెడీగా ఉంది. క్షేత్రస్థాయి నుంచే మొబైల్ వీడియో నెట్ వర్క్‌గా భావిస్తున్న ఏకైక నెట్ వర్క్‌గా అవతరించింది. రాబోయే రోజుల్లో దేశంలోని 1.3 బిలియన్ల (130 కోట్ల) మంది భారతీయులు 6G సర్వీసులకు సపోర్టు పొందాలంటే ఈజీగా అప్‌గ్రేడ్ చేయవచ్చు.