Samsung: భారత్ లో గెలాక్సీ గో, బుక్ 2 సిరీస్, బుక్ 2 బిజినెస్ ల్యాప్‌టాప్‌లు విడుదల చేసిన శాంసంగ్

శాంసంగ్ సంస్థ సరికొత్త లాప్ టాప్ లను భారత మార్కెట్లో విడుదల చేసింది. గెలాక్సీ గో, బుక్ 2 సిరీస్, బుక్ 2 బిజినెస్ అనే మూడు రకాల లాప్ టాప్ లను విడుదల చేసింది

Samsung: భారత్ లో గెలాక్సీ గో, బుక్ 2 సిరీస్, బుక్ 2 బిజినెస్ ల్యాప్‌టాప్‌లు విడుదల చేసిన శాంసంగ్

Samsung

Samsung: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్..భారత్ లో మరింత విస్తరించే దిశగా ముందుకువెళ్తుంది. ఇప్పటికే భారత ఎలక్ట్రానిక్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న శాంసంగ్ సంస్థకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ కూడా ఇండియానే. భారత్ లో ఇప్పటివరకు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, సెల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్ముతున్న శాంసంగ్ సంస్థ ఇప్పుడు మరికొన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. శాంసంగ్ సంస్థ సరికొత్త లాప్ టాప్ లను భారత మార్కెట్లో విడుదల చేసింది. గెలాక్సీ గో, బుక్ 2 సిరీస్, బుక్ 2 బిజినెస్ అనే మూడు రకాల లాప్ టాప్ లను శాంసంగ్ గురువారం విడుదల చేసింది.

Also read:Netflix: ఇకపై నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ షేర్ చేసుకోవచ్చట!!

వీటిలో ప్రీమియం-రేంజ్ లో Galaxy Book 2, Galaxy Book 2 360, Galaxy Book 2 Pro, Galaxy Book 2 Pro 360 అనే నాలుగు మోడల్స్ ఉండగా వీటి ప్రారంభ ధర రూ. 65,990గా నిర్ణయించారు. వృత్తి వ్యాపార నిపుణుల కోసం Galaxy Book 2 Business అనే లాప్ టాప్ అందుబాటులో ఉంది. దీని ధర రూ. 1,04,990గా నిర్ణయించారు. ఇక ఎంట్రీ-లెవల్ మోడల్ Galaxy Go రూ. 38,990 నుండి ప్రారంభమవుతుంది. Galaxy Book 2లో 15.6-అంగుళాల తెర ఉంటుంది. Galaxy Book 2 360 13.3 అంగుళాల తెర ఉండగా Galaxy Book 2 Pro 15.6-అంగుళాలు మరియు Galaxy Book 2 Pro 360లో 13.3-అంగుళాల పరిమాణాల తెరతో అందుబాటులో ఉన్నాయి. డిస్ప్లే మినహా బుక్ సిరీస్ లో ఫీచర్లు దాదాపుగా ఒకేలా ఉన్నాయి.

Also Read: ET: ఓటీటీలో ఈటీ.. రిలీజ్ ఎప్పుడంటే?

1080p AMOLED డిస్ప్లే మరియు ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్‌తో 12వ తరం ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్‌తో ఈ లాప్ టాప్ లు వస్తున్నాయి. 16GB LPDDR5 RAM, 512GB NVMe SSD మెమొరీ కలిగి విండోస్ 11 సాఫ్ట్‌వేర్ తో బుక్ 2 సిరీస్ లాప్ టాప్ లు వస్తున్నాయి. అయితే “బుక్ గో” లాప్ టాప్ లో మాత్రం పూర్తి భిన్నమైన ఫీచర్లు ఉన్నాయి. 14-అంగుళాల FHD LED డిస్ప్లే కలిగి ఉన్న గ్యాలక్సీ గో.. Qualcomm కంప్యూట్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా అభివృద్ధి చేసిన స్నాప్‌డ్రాగన్ 7c Gen 2 ప్రాసెసర్ కలిగిఉంది. 4 GB LPDDR4x RAM, 128 GB eUFS మెమరీ, 180-డిగ్రీలు మడిచేలా.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ప్రధానంగా విద్యార్థుల కోసం ఈ గ్యాలక్సీ గో ఉపయోగపడుతుందని సంస్థ పేర్కొంది.