Vivo V25 Pro : వివో నుంచి V25 సిరీస్ వస్తోంది. లాంచ్‌కు ముందే ఫీచర్లు రివీల్.. కెమెరాలే ప్లస్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. వివో V25 Pro సిరీస్ రానున్నట్టు తెలుస్తోంది. అయితే Vivo V25, V25 Pro స్మార్ట్‌ఫోన్‌లు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.

Vivo V25 Pro : వివో నుంచి V25 సిరీస్ వస్తోంది. లాంచ్‌కు ముందే ఫీచర్లు రివీల్.. కెమెరాలే ప్లస్!

Vivo V25 Pro To Come With Ois Enabled 64mp Camera, Storage Variants Revealed (1)

Vivo V25 Pro : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. వివో V25 Pro సిరీస్ రానున్నట్టు తెలుస్తోంది. అయితే Vivo V25, V25 Pro స్మార్ట్‌ఫోన్‌లు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ, ఈ V25 Pro వేరియంట్ సిరీస్ కీ స్పెసిఫికేషన్‌లు లాంచింగ్ ముందే రివీల్ చేసింది కంపెనీ. అయితే ఖచ్చితమైన లాంచ్ తేదీపై క్లారిటీ లేదు. Vivo 25 Pro ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో రానుంది. ఇందులో 64-MP ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. అద్భుతమైన ఇమేజ్‌లు, క్వాలిటీ వీడియోల కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో రానుంది. అంతేకాదు.. సూపర్ నైట్ మోడ్‌కు కూడా సపోర్టు చేస్తుంది. సెకండరీ కెమెరాకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సపోర్టు ఉండే అవకాశం ఉంది. ముందు ప్యానెల్‌లో 32-MP IAF సెల్ఫీ కెమెరా ఉంటుంది.

Vivo V25 Pro To Come With Ois Enabled 64mp Camera, Storage Variants Revealed

Vivo V25 Pro To Come With Ois Enabled 64mp Camera

Vivo V25 Pro 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు కూడా అందిస్తుంది. Vivo V23 Proలో 44W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌ అప్‌గ్రేడ్ తో రానుంది. Vivo V25 ప్రో వెనుక ప్యానెల్ ఫ్లోరైట్ AG గ్లాస్‌తో కలర్ మార్చే టెక్నాలజీతో రానుందని లీక్ రిపోర్టు పేర్కొంది. Full-HD+ రిజల్యూషన్‌తో 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. OnePlus Nord 2T 5Gకి సపోర్టు చేసే MediaTek Dimensity 1300 చిప్‌సెట్ తో రానుంది. ఈ ఫోన్‌కు సంబంధించి వీడియోను విరాట్ కోహ్లీ రిలీజ్ చేశాడు. బ్లూ కలర్ ఆప్షన్, వెనుక కెమెరాల బిగ్ కటౌట్ డిజైన్ ఉన్నట్టు కనిపిస్తోంది.

Vivo V25 Pro ధర ఎంత ఉండొచ్చుంటే? :
Vivo V25 స్మార్ట్ ఫోన్ వేరియంట్.. 8GB RAM + 128GB స్టోరేజ్, 12GB RAM + 256GB స్టోరేజ్ అనే రెండు స్టోరేజ్ వేరియంట్‌లతో రానుంది. ధరల పరంగా చూస్తే.. బేస్ వేరియంట్ ధర రూ. 40వేల లోపు ఉంటుంది. Vivo V23 Pro మాదిరిగానే రూ. 38,990 ప్రారంభ ధరతో వస్తుంది. Vivo V25 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత, ప్రస్తుత జనరేషన్ Vivo V23, V23 Pro మోడల్స్ త్వరలో భారత మార్కెట్లో డిస్కౌంట్ ధరకే అందుబాటులోకి రానున్నాయి.

Read Also : Vivo T1X : రూ. 15వేల లోపు ధరలో వివో T1X స్మార్ట్‌ఫోన్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!