డిజిటల్ ట్రాన్సాక్షన్లో కొత్త సిస్టమ్.. ఎంతవరకూ బెనిఫిట్

డబ్బుదే రాజ్యం.. అది నిత్య సత్యం. కానీ స్మార్ట్ ఫోన్లు వచ్చాక అది రూపం మార్చుకుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్లు, ఆన్లైన్ పేమెంట్ల రూపంలో రెండేళ్లుగా వేగం పెంచుకున్నాయి. చైనా మినహాయించి ఇతర దేశాలు మొత్తం కలిపి 2023కల్లా 2ట్రిలియన్ డాలర్ల వరకూ ..

డిజిటల్ ట్రాన్సాక్షన్లో కొత్త సిస్టమ్.. ఎంతవరకూ బెనిఫిట్

Digital Transaction

NUE in India: డబ్బుదే రాజ్యం.. అది నిత్య సత్యం. కానీ స్మార్ట్ ఫోన్లు వచ్చాక అది రూపం మార్చుకుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్లు, ఆన్లైన్ పేమెంట్ల రూపంలో రెండేళ్లుగా వేగం పెంచుకున్నాయి. చైనా మినహాయించి ఇతర దేశాలు మొత్తం కలిపి 2023కల్లా 2ట్రిలియన్ డాలర్ల వరకూ ట్రాన్సాక్షన్లు జరుగుతాయని అంటున్నారు. సమస్యలు లేకుండా వృద్ధి కనిపిస్తుండటంతో సింగిల్ పేమెంట్స్ సిస్టమ్ సాఫీగా సాగిపోతున్నాయి.

గ్లోబల్ టెక్ దిగ్గజాలు అమెజాన్, ఫేస్‌బుక్, గూగుల్ లు ఎలక్ట్రానిక్ మనీ ఫ్లోను హ్యాండిల్ చేయడం కోసం కొత్త ప్లాట్ ఫాం ఏర్పాటు చేయాలనుకుంటున్నాయి.

ఆ సిస్టమ్ ఏంటి?
50కి పైగా రిటైల్ బ్యాంక్స్ సహకారంతో నాన్ ప్రోఫిట్ అంబ్రిల్లా ఆర్గనైషేన్ అయిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్లు ప్రోసెస్ చేయనుంది. 2016నుంచి యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ తో మొబైల్ నెంబర్లను బ్యాంకులకు లింక్ చేసి ఉంచుతున్నారు. దీని ద్వారా మనీ లావాదేవీలను యాప్ లతో నడిపించుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ ధరకే. ఇవన్నీ కలిపి ఏప్రిల్ 2020 నుంచి జనవరి 2021వరకూ రూ.31.7ట్రిలియన్ డాలర్లు సొంతం చేసుకుంది. అంటే దేశంలో సగం రిటైల్ ట్రాన్సాక్షన్లు ఆన్ లైన్లోనే జరిగాయి. ప్రస్తుత ఏడాదిలో అది రెట్టింపు కావాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ సిస్టమ్‌తో వచ్చిన సమస్యలేంటి?
ట్రాఫిక్ పెరుగుతున్న కొద్దీ మరింత రిస్కీగా మారుతుంది. మహమ్మారి సమయంలో ఇంట్లోనే ఉండటంతో షాపింగ్, ఎంటర్‌టైన్మెంట్ కోసం ఇంటర్నెట్ బాగా వాడారట. అదే సమయంలో ఇంటర్నెట్ ఫ్రాడ్, సైబర్ క్రైమ్స్, ట్రాన్సాక్షన్లు వంటివి రివర్స్ అవడం, రద్దు కావడం వంటివి జరిగాయి. టాప్ బ్యాంకులు, ఎన్పీసీఐలకు కూడా ఇదే సమస్య. ఫిబ్రవరి నెలలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు సిస్టమ్ అప్ గ్రేడ్ చేయడంతో చాలా ఇబ్బందులకు గురయ్యారు. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020లో ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించి కొత్త ప్లాట్ ఫాంకు లైసెన్స్ కోసం వేలానికి పిలిపించింది.

దీని వల్ల ఒరిగేదేంటి?
న్యూ అంబ్రిల్లా ఎంటిటీ ప్రకారం.. ఈ ప్లాట్ ఫాం అనేది లాభం కోసమే. ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధించడం ద్వారా సంపాదించుకోవచ్చు. ఆన్ లైన్ షాపింగ్ అకౌంట్ల ద్వారా కస్టమర్లు సంపాదించుకోవచ్చు. ఆపరేటర్ ఇండియన్ అయితే ప్రమోటర్ కనీసం 25శాతం నుంచి 40శాతం లాభం దక్కించుకోవచ్చట. దీని కోసం పెట్టుకోవాల్సిన అప్లికేషన్ల గడువు మార్చి 31కి మాత్రమే. ఎంపిక ప్రక్రియకు మాత్రం మరికొద్ది నెలలు పట్టే అవకాశముంది.

కస్టమర్ల కోసం ఇందులో ఏముంది:
ఈ సిస్టమ్స్ అనేవి సమాంతరంగా రన్ అవుతూ ఉంటాయి. యూజర్లకు ఆప్షన్లు ఎక్కువగా ఇవ్వడానికి ప్లాట్ ఫాంలతో పోటీపడేందుకు హెల్ప్ అవుతాయి. ఆన్ లైన్ వెండర్లకు ఇన్సెంటీవ్స్ ఇచ్చే వీలు కల్పిస్తాయి. దానిని బట్టి ఈ కామర్స్ విస్తరిస్తుంది. 2017లో వచ్చిన ఓ రిపోర్టు ఆధారంగా 190మిలియన్ మంది ఇండియన్లకు బ్యాంక్ అకౌంట్లు లేవని తెలిసింది. రీసెంట్ గా చాలా మంది కస్టమర్లు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే వాడుకోవడానికి ప్రత్యామ్న్యాయ ప్లాట్ ఫాం లేకుండా పోయేది. ఇది వచ్చాక అలాంటి ఇబ్బంది అవసరం లేదు.

ఇప్పటి వరకూ అప్లై చేసుకున్నవారు:
దీని కోసం అమెజాన్.. వీసా ఇన్క,ల సంస్థ కోసం ఇండియన్ ప్రైవేట్ వర్తకులైన ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్ లు సహకారం అందిస్తున్నాయి. రెండు ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టార్టప్స్, పైన్ ల్యాబ్స్, బిల్ డెస్క్ లతో సర్వీస్ నడిపిస్తున్నారు.

మరో ధనిక గ్రూప్ ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫేస్‌బుక్, ఆల్ఫాబెట్ ఇన్క్ గూగుల్ లు కలిసి 10బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే జియో ప్లాట్ ఫామ్స్, రిలయన్స్ డిజిటల్ సర్వీసెస్ యూనిట్ లో 2020లోనే పెట్టుబడులు పెట్టాయి.

ఇండియాస్ డిజిటల్ పేమెంట్స్ లీడర్ పేటీఎం కూడా ఓలా లాంటి స్టార్టప్ తో పాటు మరో ఐదు కంపెనీలను కలుపుకుని ఇందులో అడుగుపెట్టేసింది.

టాటా గ్రూప్.. మాస్టర్ కార్డ్ తో కలిసి భారతీ ఎయిర్ టెల్ లిమిటెడ్, రెండు ఇండియన్ బ్యాంకులైన HDFC, Kotak సంయుక్తంగా ప్రయత్నిస్తుంది.

ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లతో కలిసి ఫైనాన్షియల్ సాఫ్ట్ వేర్ అండ్ సిస్టమ్ అప్లై చేసింది.

అమెరికాకు చెందిన ఎఫ్ఐఎస్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో కలిసి ట్రై చేస్తుంది.