Zomato నుంచి తప్పుకున్న కో-ఫౌండర్ గౌరవ్ గుప్తా!

ఫుడ్ టెక్ ప్లాట్‌ఫాం జొమాటో (Zomato) నుంచి సహ వ్యవస్థాపకుడు గౌరవ్ గుప్తా తప్పుకున్నారు. ఈ మేరకు మంగళవారం బ్లాగ్ పోస్ట్‌లో కంపెనీ వెల్లడించింది.

Zomato నుంచి తప్పుకున్న కో-ఫౌండర్ గౌరవ్ గుప్తా!

Zomato Co Founder Gaurav Gupta Quits

Zomato Co-Founder Gaurav Gupta Quit : ఫుడ్ టెక్ ప్లాట్‌ఫాం జొమాటో (Zomato) నుంచి సహ వ్యవస్థాపకుడు గౌరవ్ గుప్తా తప్పుకున్నారు. ఈ మేరకు మంగళవారం బ్లాగ్ పోస్ట్‌లో కంపెనీ వెల్లడించింది. 2015లో జొమాటోలో చేరినప్పటి నుంచి గుప్తా పాపులర్ అయ్యారు. 2018 లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)లో నియమితుడై.. 2019లో ఫౌండర్‌గా ఎదిగారు. జొమాటో నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు గుప్తా తెలిపారు.

‘నేను నా జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకుంటున్నాను.. ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాను. నా జీవితంలో జొమాటోలో గత 6ఏళ్లుగా కొనసాగాను. జొమాటోతో మాకు గొప్ప బృందం ఉంది. కంపెనీని ముందుకు తీసుకెళ్లడంలో నా ప్రయాణంలో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవలసిన సమయం వచ్చింది. జొమాటో నుంచి వైదొలగడం చాలా భావోద్వేగానికి లోనయ్యాను’ అంటూ గుప్తా కంపెనీ సిబ్బందికి రాసిన మెయిల్‌లో రాసుకొచ్చారు.
Apple : అదిరే ఫీచర్లతో iPhone 13 సిరీస్ వచ్చేసిందిగా.. ధర ఎంతంటే?

గుప్తా పోస్టుకు స్పందనగా.. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ (Deepinder Goyal) ధన్యవాదాలు తెలిపారు. గత 6 ఏళ్లు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. తమ ప్రయాణం ఇంకా చాలా ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. గ్రేట్ టీం తమతో ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. డైనింగ్, జోమాటో ప్రో, అడ్వర్టైజింగ్, సేల్స్ టేబుల్ రిజర్వేషన్స్ వంటి అనేక వ్యాపారాల అభివృద్ధికి గుప్తా కీలక పాత్ర పోషించారు.

జొమాటోలో చేరడానికి ముందు గుప్తా AT కియర్నీ లిమిటెడ్‌తో 10 ఏళ్లు పాటు పనిచేశాడు. గుప్తా IIT- ఢిల్లీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ , IIM కోల్ కతా నుంచి MBA డిగ్రీ పూర్తి చేశారు. జోమాటో సెప్టెంబర్ 17 నుంచి రేషన్ డెలివరీ సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించిన ఒక రోజు తర్వాత గుప్తా తన రాజీనామా విషయం వెలుగులోకి వచ్చింది. కిరాణా డెలివరీ ప్లాట్‌ఫామ్ గ్రోఫర్స్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు జొమాటో 100 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 745 కోట్లు) పెట్టుబడి పెట్టింది.
Apple Ipad : వచ్చేస్తోంది.. కొత్త ఐప్యాడ్ మినీ ధర 499 డాలర్లు