Zomato: జొమాటో కొత్త మెంబర్‌షిప్‌ ప్లాన్.. ప్రో ప్లస్!

ఫుడ్ డెలివరీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్, ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా లీడింగ్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఈ మధ్యనే ఐపీవోతో దుమ్మురేపిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ప్రో ప్లాన్ ను మించి ప్రో ప్లస్ ప్లాన్ మరోదాన్ని తీసుకొచ్చింది.

10TV Telugu News

Zomato: ఫుడ్ డెలివరీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్, ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా లీడింగ్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఈ మధ్యనే ఐపీవోతో దుమ్మురేపిన సంగతి తెలిసిందే. కాగా, జొమాటో ఇప్పటికే ప్రో పేరుతో ఒక మెంబర్ షిప్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చి పలు డిస్కౌంట్‌తో పాటు, ఉచిత డెలివరీ సేవలను అందిస్తోంది. ఈ ప్లాన్‌ కోసం 90 రోజులకు రూ.200 ఛార్జ్ చేస్తుంది.

కాగా, ఇప్పుడు ప్రో ప్లాన్ ను మించి ప్రో ప్లస్ ప్లాన్ మరోదాన్ని తీసుకొచ్చింది. దీనిద్వారా అన్‌లిమిటెడ్‌ ఫ్రీ డెలివరీ, నో సర్జ్‌ ఫీ, నో డిస్టెన్స్‌ ఫీ సేవలను అందించనుంది. ఈ ప్లాన్ వివరాలను జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. కాగా, ఈ ప్రో ప్లస్ ప్లాన్ పరిమిత కాలం పాటు పరిమిత సంఖ్యలోనే అందించనున్నట్లుగా గోయల్‌ తెలిపారు. ఇక ఈ ప్లాన్ పొందేందుకు చార్జీలను కూడా గోయల్ వెల్లడించలేదు.

ప్రో ప్లస్ ప్లాన్ ఎలా పొందాలి?
జొమాటో తీసుకొచ్చిన ఈ సరికొత్త మెంబర్‌షిప్‌ ప్లాన్‌ పొందేందుకు కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. జొమాటో ఈ ప్లాన్ ను ఆగస్టు 2 సాయంత్రం 6 గంటల తర్వాత అందుబాటులోకి తీసుకురానుండగా, ఆ తర్వాత జొమాటో యాప్‌ ఓపెన్‌ చేస్తే ఎవరికైతే ఇన్వైట్‌ వస్తుందో వారు ఈ కొత్త ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్‌ అవ్వొచ్చు. ఇక ప్రస్తుతం జొమాటో ఎడిషన్‌ బ్లాక్‌ క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్లుగా ఉన్న వారు ఆటోమేటిక్‌గా ఈ ప్రో ప్లస్‌కు అప్‌గ్రేడ్‌ కానున్నారు.

10TV Telugu News