బృందావనంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సంగీతం మాస్టార్

  • Published By: murthy ,Published On : September 3, 2020 / 07:53 AM IST
బృందావనంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సంగీతం మాస్టార్

టూరిస్ట్ వీసాపై భారత్ వచ్చి బృందావనంలో నివాసం ఉంటున్న ఒక సంగీతం మస్టార్ ఉక్రెయిన్ కు చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.



పాకిస్తాన్ లోని కరాచీ కి చెందిన ఆనంద్ కుమార్ అనే సంగీతం మాస్టార్ టూరిస్ట్ వీసాపై భారత్ వచ్చి కొన్నేళ్లుగా ప్రసిధ్దం హిందూ క్షేత్రం మధురలోని బృందావనంలో ఉంటున్నాడు. కుమార్ కృష్ణ భక్తులకు భజనలు పాడటం, సంగీతం నేర్పిస్తూ ఉండేవాడు.
https://10tv.in/lover-kiss-the-bride-in-front-of-the-groom-karimnagar/
ఉక్రెయిన్ కు చెందిన శ్రీకృష్ణ భక్తులైన దంపతులు విడిపోయి చైతన్య విహార్ సమీపంలో విడివిడిగా నివసిస్తున్నారు.  వారి కుమార్తె 17 ఏళ్ల మైనర్ బాలిక తనతండ్రితో కలిసి ఉంటోంది. మైనర్ బాలిక భజనలు నేర్పించే ఆనంద్ కుమార్ వద్దకు వచ్చి భజనలు పాడటం నేర్చుకుంటోంది.



బాలికపై కన్నేసిన సంగీతం మాస్టారు బాలికను లోంగదీసుకున్నాడు. భజనలు నేర్చు కోటానికి వచ్చినప్పడు మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తున్నాడు. 3సార్లు  సంగీతం మాస్టార్ తన పై అత్యాచారం చేసే సరికి బాలిక తన తండ్రికి ఈ విషయం చెప్పింది.

వెంటనే బాలిక తండ్రి బృందావనం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంగీతం మాస్టార్ని అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు మధుర ఎస్పీ ఉదయ్ శంకర్ తెలిపారు.