35 ఏళ్ల దళిత మహిళ గ్యాంగ్ రేప్..వీడియో తీసి రూ.300లకు అమ్మేసి..గ్రూపుల్లో వైరల్ చేసిన దారుణం

35 ఏళ్ల దళిత మహిళ గ్యాంగ్ రేప్..వీడియో తీసి రూ.300లకు అమ్మేసి..గ్రూపుల్లో వైరల్ చేసిన దారుణం

Gangrape

UP : badaun Minor Boys Gangrape Dalit Woman Video Sell For Rs 300 :  UP Gang Rape: యూపీలో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బడాన్ జిల్లాలోని ఓ గ్రామంలో 35 ఏళ్ల మహిళను ఐదుగురు కలిసి దారుణంగా అత్యాచారం చేసి దాన్ని వీడియో తీశారు. ఆ వీడియోతో ఆమెను బెదిరించి నోరెత్తకుండా చేశారు. ఈ విషయం మర్చిపో..లేదంటే ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసి నీ బతుకు నాశనం చేస్తామని బెదిరించారు. దీంతో ఆమె నోరెత్తలేదు. కానీ ఆ దుర్మార్గులు అన్నమాటమీద నిలబడలేదు.

ఎందుకంటే వాళ్లు నీచాతినీచమైన దుర్మార్గులు కాబట్టి..తాజాగా ఆమెను అత్యాచారం చేసిన వీడియోను రూ.300లకు అమ్మేసుకున్నాడు అత్యాచారం చేసినవారిలో ఒకడు. వాట్సప్ గ్రూపుల్లో పెట్టి ఆమె బతుకును అల్లరిపాలు చేశాడు. ఆ వీడియోలు చూసివారంతా మన ఊరిలో ఇంత దారుణం జరిగిందా? ఇన్నాళ్లూ మనకు తెలియలేదే?! అంటూ అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్లుగా ఆశ్చర్యపోయారు. ఆవీడియో అలా అలా గ్రూపుల్లో షేర్ కావటంతో బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది.

‘‘నా జీవితం ఎలాగూ నాశనం అయిపోయింది. కానీ నా కుటుంబం అల్లరిపాలు కాకూడదని ఇన్నాళ్లు నాపై జరిగిన దారుణాన్ని మౌనంగా భరిస్తూ వచ్చాను. నాపై జరిగిన అత్యాచారాన్ని బయటపెట్టలేదు. అది జరిగినాటినుంచి ఒక్క క్షణం కూడా మనశ్శాంతిగా లేను..కానీ ఆ వీడియోను బయటపెట్టి నన్ను ఇంత మానసిక క్షోభకు గురిచేసినవారిని శిక్షించండీ’’అని కోరుతూ పోలీసుల్ని ఆశ్రయించిన ఘటన యూపీలో కలకలం రేపింది.

ఈ దారుణ సామూహిక అత్యాచారం 2020 అక్టోబర్‌లో జరిగింది. 30 ఏళ్ల మహిళను ఐదుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు గానీ, బయటు ఎవరికైనా చెబితే చంపేస్తామని రేపిస్టుల్లో ఒకడు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భయపడిన ఆమె సైలెంట్ గానే ఉండిపోయింది. మౌనంగా ఆ దారుణాన్ని భరించింది. అత్యాచారానికి తెగబడినవారిలో నలుగురు మైనర్లు ఉన్నారు. వారి వయస్సు 15 ఏళ్లు, 16,17 ఏళ్లు.

ఐతే… తాజాగా ఆమె ఉంటున్న ఊరిలో ఆమెను గ్యాంగ్ రేప్ చేసిన వీడియో వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. దాంతో విషయం ఊరంతా తెలిసింది. ఈ దారుణం గురించి ఎప్పుడైతే బయటికి వచ్చిందో…ఆమె పోలీసులకూ ఫిర్యాదు చేసింది. దీంతో సదరు నిందితులు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

బడాన్ జిల్లా సూపరింటెండెంట్ (గ్రామీణ) సిద్ధార్థ వర్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బాధితురాలిని ఐదుగురు వ్యక్తులు అపహరించి..మీరట్‌ శివార్లలో సామూహిక అత్యాచారం చేశారు. అలా అత్యాచారం చేసినవాళ్లు ఆ గ్యాంగ్‌ రేప్‌ని వారి మొబైల్ ఫోన్లతో వీడియో రికార్డ్ చేశారు. విషయం ఎవరికైనా చెబితే… వీడియోను అందరికీ చూపిస్తామని, చంపేస్తామని బెదిరించడంతో ఆమె నిస్సహాయురాలిలా ఉండిపోయింది.

ఈక్రమంలో వాళ్లు మరో దారుణానికి ఒడిగట్టారు. గ్యాంగ్ రేప్ వీడియోని సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు వారిలో ఒకడు. గత శనివారం ఈ వీడియో వైరల్ అయ్యింది. ఊళ్లో చాలా మంది దీన్ని షేర్ చేసుకున్నారు. మనకు తెలియకుండా మన ఊళ్లో ఇంత దారుణం జరిగిందా అని చెప్పుకున్నారు..కొంతమంది ఆమె వంక అదోలా చూడటంతో ఆమెకు అనుమానం వచ్చింది. విషయం తెలిసి కృంగిపోయింది. దీంతో మాకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు ఊళ్లోకి ఎంటరై… వీడియో ఎక్కడిది అని అడిగితే… తమకు అతికాయ్‌జాన్ అనే యువకుడు రూ.300లకు అమ్మాడని చెప్పారు. దీంతో పోలీసులు వారందరి మొబైళ్లలో ఆ వీడియోని డిలీట్ చేయించారు. అనంతరం అతికాయ్‌జాన్‌ని పట్టుకొని..తమదైన శైలిలో వాయించారు. దీంతో విషయం అంతా కక్కాడు. అలా మిగిలినవారిని అత్యాచారానికి పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో గ్రామస్తులంతా ఈ దారుణానికి పాల్పడివారంతా కఠిన శిక్ష వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.