America Shooting : అమెరికాలో మరోసారి కాల్పులు.. 8 మంది మృతి
పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు. గతంలో కూడా అమెరికాలో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.

America Shooting
America Shooting : అమెరికాలో వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి యూఎస్ లో కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్ మాల్ లో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 మంది మృతి చెందారు.
మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారికి డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ శివారులో ఉన్న ఓ మాల్ లోకి చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
America Shooting : అమెరికాలో మరోసారి కాల్పులు.. ఐదుగురు మృతి, మరో ఆరుగురికి గాయాలు
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.36 గంటలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
దుండగుడు కాలినడకన వెళ్తున్నవారిపై కాల్పులు జరిపిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, గతంలో కూడా అమెరికాలో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు సార్లు జరిగిన కాల్పుల్లో అనేక మంది మృతి చెందారు.