Peru Bus Accident : పెరూలో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడి 27 మంది మృతి

దక్షిణ పెరూలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో 27 మంది మృతిచెందారు. మరో 16 మందికి తీవ్రంగా గాయలయ్యాయి. పాలొమినో కంపెనీకి చెందిన బ‌స్సు.. పెరూలోని అయాకుచో నుంచి అరెక్విపా వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Peru Bus Accident : పెరూలో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడి 27 మంది మృతి

At Least 27 Miners Killed In Peru Bus Accident (2)

Updated On : June 19, 2021 / 12:08 PM IST

Peru Bus Accident  : దక్షిణ పెరూలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో 27 మంది మృతిచెందారు. మరో 16 మందికి తీవ్రంగా గాయలయ్యాయి. పాలొమినో కంపెనీకి చెందిన బ‌స్సు.. పెరూలోని అయాకుచో నుంచి అరెక్విపా వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కాల‌మానం ప్ర‌కారం.. తెల్ల‌వారుజామున 3 గంటల సమయంలో పర్యత ప్రాంతమైన ఇంట‌రియోసియానిక్ జాతీయ ర‌హ‌దారిపై (Ares) మైనింగ్ కంపెనీకి చెందిన బస్సు ఒక్క‌సారిగా1300 అడుగుల లోయ‌లోకి దూసుకెళ్లిందని పెరూ అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాదంలో బస్సు లో ప్రయాణిస్తున్న వారిలో 27 మంది అక్కడికక్కడే మృతిచెందారు. పెరూ దేశ రాజధాని లిమా నగరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పాలొమినో కంపెనీకి చెందన బస్సులో పలు కుటుంబాలు ప్రయాణిస్తున్నాయి. డ్రైవర్ నిద్రపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మైనింగ్ సిబ్బంది వారాలుగా పనిలో ఉండగా.. వారం పాటు విశ్రాంతి కోసం ఇంటికి తిరిగి వెళ్తున్నరని కంపెనీ తెలిపింది. ఈ క్రమంలోనే ఘోర ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు.

గాయపడిన సిబ్బందిని ఆర్ పీపీ రేడియోలో నాస్కా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చ‌ర్య‌లు చేప‌ట్టారు. పెరూలో 10 రోజుల వ్యవధిలో రోడ్డు ప్రమాదం జరగడం ఇది రెండోసారి. అత్యంత ప్రమాదకరమైన ఈ పర్వత ప్రాంతంలో వేగంగా వెళ్లే వాహనాలు వెళ్లడం.. ప్రమాదకర హెచ్చరిక బోర్డులు లేకపోవడం, ట్రాఫిక్ సేఫ్టీ విభాగం లేకపోవడం కారణంగా తరచూ ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోంది.