Boy Shot Dead: చిన్నారుల దొంగ-పోలీస్ ఆట.. తుపాకితో కాల్చడంతో బాలుడు మృతి

దొంగ-పోలీస్ ఆట ఆడుకుంటుండగా ఒక బాలుడి నిర్లక్ష్యం మరో బాలుడి ప్రాణం తీసింది. బాలుడి చేతిలో ఉన్న తుపాకి పొరపాటున పేలడంతో మరో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది.

Boy Shot Dead: చిన్నారుల దొంగ-పోలీస్ ఆట.. తుపాకితో కాల్చడంతో బాలుడు మృతి

Boy Shot Dead

Boy Shot Dead: చిన్నారుల దొంగ-పోలీస్ (హైడ్ అండ్ సీక్) ఆటలో ఒక పొరపాటు బాలుడి ప్రాణం తీసింది. ఆటలో భాగంగా ఒక బాలుడిపై, మరో బాలుడు తుపాకితో కాల్చాడు. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కౌషంబి జిల్లాలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో, అతడి కొడుకుతోపాటు మరో ఇద్దరు పిల్లలు శనివారం సాయంత్రం దొంగ-పోలీస్ (హైడ్ అండ్ సీక్) ఆట ఆడుకుంటున్నారు.

Rajasthan: స్నేహితుడితో కనిపించిన భార్య.. ఏడు గంటలు చెట్టుకు కట్టేసి కొట్టిన భర్త

ఈ క్రమంలో ఇద్దరు పిల్లలు దాక్కున్నారు. మరో బాలుడు వారి కోసం వెతుకుతూ ఉండగా, కప్ ‌బోర్డులో చిన్న తుపాకి కనిపించింది. ఈ క్రమంలో బాలుడు తన చేతిలో ఉన్న తుపాకిని అనుకోకుండా పేల్చడంతో, మరో బాలుడు (10) అక్కడికక్కడే మరణించాడు. క్షణాల్లో రక్తపు మడుగులో కనిపించిన స్నేహితుడిని చూసి, తుపాకీ పేల్చిన బాలుడు ఏడ్వడం మొదలుపెట్టాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని, పరిస్థితి చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Congress: దేశవ్యాప్త నిరసనలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్.. వచ్చే నెల 5న ఉద్యమం

ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించింది. ఈ ఘటనకు కారణమైన తుపాకి, రాజకీయ నాయకుడైన బాలుడి తండ్రిదిగా గుర్తించారు. కాగా, ముగ్గురూ మంచి స్నేహితులని, ఎప్పుడూ కలిసే ఆడుకుంటారని, అనుకోకుండా ఈ ఘటన జరిగిందని పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు.